Home> జాతీయం
Advertisement

Krishna Flood Water: కృష్ణా, గోదావరి నదుల్లో పెరుగుతున్న వరద ప్రవాహం, దిగువకు నీటి విడుదల

Krishna Flood Water: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఫలితంగా కృష్ణా నది జలాశయాల్లో వరద పోటెత్తుతోంది. డ్యాంలన్నీ 80-90 శాతం నిండిపోయి..కళకళలాడుతున్నాయి.
 

Krishna Flood Water: కృష్ణా, గోదావరి నదుల్లో పెరుగుతున్న వరద ప్రవాహం, దిగువకు నీటి విడుదల

Krishna Flood Water: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. ఫలితంగా కృష్ణా నది జలాశయాల్లో వరద పోటెత్తుతోంది. డ్యాంలన్నీ 80-90 శాతం నిండిపోయి..కళకళలాడుతున్నాయి.

మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా కృష్ణా నదిలో (Krishna river) వరద ప్రవాహం పెరుగుతోంది. కృష్ణా నదిపై నిర్మించిన ఆల్మట్టి, నారాయణ పూర్ జలాశయాలకు భారీగా వరద(Flood Water) పోటెత్తుతోంది. ఆల్మట్టి డ్యాం (Almatti Dam)పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 123 టీఎంసీలు కాగా..ఇప్పటికే 94 టీఎంసీలకు చేరుకుంది. 43 వేల 960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ..నారాయణపూర్ డ్యాంలో నీటిమట్టం పెరుగుతోంది. నారాయణపూర్ డ్యాం(Narayanpur Dam)లో నీటి సామర్ధ్యం 33.03 టీఎంసీలు కాగా..ఇప్పటికే 29.05 టీఎంసీలకు చేరుకుంది. ఫలితంగా డ్యాంకు అదనంగా వచ్చిన నీరును వచ్చినట్టే దిగువకు వదిలేస్తున్నారు. 

అటు తుంగభద్ర డ్యాంలో (Tungabhadra Dam)కూడా వరద పోటెత్తుతోంది. రోజుకు 40 వేల క్యూసెక్యుల నీరు వచ్చి చేరుతోంది. డ్యామ్ గరిష్ట నీటి సామర్ధ్యం 100 టీఎంసీలు కాగా..40 టీఎంసీలకు చేరువలో ఉంది. టీబీ డ్యాం పరిధిలోని ఎల్ఎల్ సీ, హెచ్చెల్సీ కాల్వలకు నీరు విడుదల చేయనున్నారు. ఇక గోదావరి(Godavari River)పరివాహక ప్రాంతంలోనూ వర్షాలు కురుస్తుండటంతో ధవిళేశ్వరం బ్యారేజ్(Dowlaiswaram Barrage) వద్ద వరద నీటి మట్టం పెరుగుతోంది. 1 లక్షా 37 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. 

Also read: AP IT Policy 2021-24: ఐటీ రంగం అభివృద్దికి ఏపీ ప్రత్యేక దృష్టి, 2021-24 కొత్త ఐటీ పాలసీ విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More