Home> జాతీయం
Advertisement

Traffic Rules: బైక్ మీద వెనుక కూర్చున్న వాళ్లతో మాట్లాడిన నేరమే.. అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్.. డిటెయిల్స్ ఇవే..

Kerala new traffic rule: చాలా మంది బైక్ ల మీద కూర్చుని వెనుక ఉన్న వాళ్లతో బాతాఖాని కొడుతుంటారు.ఇక మీదట ఇలాంటివి చేసిన కూడా నేరమే అంటూ కేరళ రవాణాశాఖ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది.
 

Traffic Rules: బైక్ మీద వెనుక కూర్చున్న వాళ్లతో మాట్లాడిన నేరమే..  అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్.. డిటెయిల్స్ ఇవే..

kerala new traffic rule talking to pillion rider is now a crime: రోడ్డుపై టూవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని అధికారులు చెప్తుంటారు. టూవీలర్ వాహనదారులు..  తప్పనిసరిగా హెల్మెట్ల ను ధరించాలి. అంతేకాకుండా.. ఫోన్ మాట్లాడుకుంటూ వాహనం నడపకూడదు. అంతేకాకుండా.. రాంగ్ రూట్లలో అస్సలు వెళ్లకూడదు. వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ను  ధరించాలి. ఇక ఫోర్ వీలర్ ల విషయానికి వస్తే.. వీరు.. కారు నడిపేటప్పుడు బెల్ట్ ను ధరించాలి. లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. వాహనం నడపడానికి వస్తేనే రోడ్డుమీదకు రావాలని ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అధికారులు చెప్తుంటారు. ఎలాంటి ట్రాఫిక్ వయోలేషన్ అయిన అస్సలు చేయోద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తుంటారు.

Read more: Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?

కానీ కొందరు టూవీలర్, ఫోర్ వీలర్ వాహన దారులు మాత్రం ఇష్టమున్నట్లు రోడ్ల మీద వాహనాలునడిపిస్తుంటారు. వీరు ప్రమాందంలో పడటమే కాకుండా.. చుట్టుపక్కల ఉన్న వారిని కూడా డెంజన్ లో నెట్టేస్తుంటారు. కొందరు టూవీలర్లు రోడ్డుపై వాహనం నడిపిస్తున్నప్పుడుఫోన్ లలో మాట్లాడుతుంటారు. మరికొందరు ఏదో మనిగిపోయినట్లు.. వెనుక  కూర్చున్న వారితో కూడా ముచ్చట్లు పెడుతుంటారు. ఇలాంటి వారికి పోలీసులు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.  కేరళ సర్కారు కొత్త  చట్టం తీసుకొచ్చింది. 

పూర్తి వివరాలు..

కేరళ రాష్ట్ర మోటారు వాహనాల శాఖ - ఎంవీడీ.. ఈ కొత్త ట్రాఫిక్ చట్టంను ప్రవేశపెట్టింది. బైక్ నడిపే వ్యక్తి వెనక కూర్చున్న వారితో మాట్లాడటం ఇక నుంచి శిక్షార్హమైన నేరం అని కేరళ సర్కార్ తెల్చి చెప్పింది. బైక్ నడిపేవారు.. వెనుక కూర్చున్న వారితో ముచ్చట్లు పెట్టడం వల్ల... డ్రైవింగ్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రవాణా శాఖ అధికారులు గుర్తించారు.

Read more: Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..

ఈ నేపథ్యంలోనే..ఈ నిబంధనను తీసుకున్నట్లు జాయింట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కే మనోజ్‌ కుమార్‌ పేర్కొన్నారు.  ఈ కొత్త నిబంధనను ఉల్లంఘించి.. బైక్‌ నడిపే సమయంలో వెనుక కూర్చున్న వారితో మాట్లాడే వారికి ఇక నుంచి జరిమానాలు విధిస్తామని తెలిపారు. అయితే ఆ జరిమానా ఎంత అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే ఈ కొత్త నిబంధన పట్ల కేరళ వాహనదారుల్లో కొందరు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More