Home> జాతీయం
Advertisement

Air hostess: దొరికిపోయిన లేడీ ఎయిర్ హోస్టెస్.. ప్రైవేట్ పార్ట్ లో బంగారం పేస్ట్.. ఎయిర్ హిస్టరీలో తొలికేసు..

Kerala:ఎయిర్ హోస్టెస్ కదలికలు అనుమానంగా ఉండటంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఎదురైంది. దేశంలో ఒక విమానయాన సంస్థ ఉద్యోగి ఇలా చేయడం తొలిసారి అని ఆ సంస్థ ప్రకటించింది.

 Air hostess: దొరికిపోయిన లేడీ ఎయిర్ హోస్టెస్.. ప్రైవేట్ పార్ట్ లో బంగారం పేస్ట్.. ఎయిర్ హిస్టరీలో తొలికేసు..

Kerala air hostess from kolkata arrested by dri police: తరచుగా మనం విమానాశ్రయంలో బంగారం, వజ్రాలు స్మగ్లింగ్ కు చెందిన వార్తలను చూస్తుంటాం. కొందరు బంగారాన్ని బ్యాగులకు ఏదైన స్పెషల్ గా పాకెట్ లాంటివి చేయించి అందులో పెడతారు. మరికొందరు పాదాలకు చెప్పులకు ఒక లేయర్ లాగా పొరను ఏర్పాటు చేసి, దానికి బంగారం పేస్టులను అతికిస్తారు. ఇక మరికొందరైతే.. పొట్టలో క్యాప్సిల్ రూపంలో బంగారంను పెట్టుకుంటారు. గోల్డ్ ను తలలోని విగ్ కు అతికించి మరీ సీక్రెట్ గా తరలించేందుకు రకరకాల ప్లాన్ లు వేస్తుంటారు.

Read more; Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..

మరికొన్ని చోట్ల సీక్రెట్ గా అంతర్గత అవయవాల్లో కూడా, లోదుస్తులలో బంగారం ను తరలించేందుకు రకరకాల ప్లాన్ లు వేస్తుంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. ఈ నేపథ్యంలో.. ఒక ఎయిర్ హోస్టేస్ స్మగ్లింగ్ చేస్తు అడ్డంగా దొరికిపోయింది.  ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు..

కేరళ కన్నూర్ విమానశ్రయంలో పోలీసులు స్మగ్లింగ్ కు పాల్పడుతున్న లేడీ ఎయిర్ హోస్టేస్ ను పట్టుకున్నారు. ముందుగా పోలీసులకు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో.. డైరెక్టరెట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎయిర్ హోస్టేస్ రాగానే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మస్కట్ నుంచి కన్నూర్ కు విమానంలో వచ్చింది. ఆమెను ప్రత్యేకంగా విచారణ చేయగా.. పోలీసులకు దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఎదురైంది. ఆమె అంతర్గత అవయవ భాగంలో కేజీ వరకు బంగారం పేస్ట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

వెంటనే పోలీసులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి బంగారంను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన మే 28 న జరిగినట్లు సమాచారం. ఎయిర్ సిబ్బంది, లేడీ ఎయిర్ హోస్టేస్ ను కోర్టులో హజరు పర్చగా, ఆమెకు 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఇదిలా ఉండగా సదరు లేడీ ఎయిర్ హోస్టేస్ సురభి ఖాతున్ కలకత్తాలో పనిచేస్తున్నట్లు సమాచారం.

Read more: Hot Romance: రన్నింగ్ బస్సులో అశ్లీల పనులు.. లాస్ట్ సీటులో ఒకరిమీద మరోకరు..

ఈ స్మగ్లింగ్ ఘటనలో కేరళకు చెందిన గ్యాంగ్ హస్తం ఉన్నట్లు ఇంటెలీజెన్స్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక ఇండియన్ ఎయిర్ చరిత్రలో.. ఒక సంస్థ ఉద్యోగి ఇలా స్మగ్లింగ్ చేస్తు దొరికి పోవడం తొలిసారి అని ఆ సంస్థ ప్రకటించింది. ఈ  ఘటన ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారింది. విమానశ్రయంలో ప్రతిరోజు వేల మంది దేశ , విదేశాల మధ్య రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు ముస్లిం అరబ్ దేశాల్లో బంగారం ధరలు ఇక్కడితో పోలిస్తేతక్కువగా ఉంటాయని రహస్యంగా తీసుకొని వచ్చేందుకు తరచుగా అనేక మంది నానా తంటాలు పడుతుంటారు.

ఈ బంగారం స్మగ్లింగ్ రాకెట్ ను పోలీసులు తరచుగా ఛేదిస్తు ఉంటారు. కొందరు ఎయిర్ పోర్టులలో తమ వాళ్లను నియమించి, పోలీసుల కళ్లు కప్పేందుకు ప్రయత్నిస్తుంటారు. విదేశాలకు భయంకరమైన వ్యాధి కోసం ట్రీట్మెంట్ కు వెళ్లినట్లు నటించి, బెడ్ స్ట్రేచర్ మీద ఉన్నట్లు నటిస్తారు. వీల్ చైర్ లలో కూర్చుని బంగారం స్మగ్లింగ్ చేస్తు దొరికిపోయిన ఘటనలు గతంలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More