Home> జాతీయం
Advertisement

ఢిల్లీలో కేసీఆర్ బీజీబీజీ ; ఫెడరల్ ఫ్రంట్ కోసం యత్నాలు

జాతీయ స్థాయిలో ఫెడరల్ కూటమి కోసం గత ఎనిమిది నెలల నుంచి యత్నాలు చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దీనిపై ఇప్పుడు సీరియస్ గా దృష్టిసారించారు.

ఢిల్లీలో కేసీఆర్ బీజీబీజీ ; ఫెడరల్ ఫ్రంట్ కోసం యత్నాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ ..ఇప్పుడు సీనియస్ గా జాతీయ రాజీయాలపై దృష్టిసారించారు.  2019 సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రాంతీయపార్టీలన్నీంటినీ ఏకతాటిపై తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నారు. ఈ లక్ష్యంలో భాగంగా జాతీయ స్థాయిలో బీజేపీ-కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మొన్న ఒడిశా సీఎం, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ ను ..నిన్న తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, బెంగాల్ సీఎం మమతతో భేటీ అయ్యారు. ఇప్పుడు ఢిల్లీలో మూకాం వేసిన కేసీఆర్ ..ఈ రోజు బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా జాతీయ రాజకీయాలపై చర్చ జరగనుంది. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యతకను కేసీఆర్ వివరించనున్నారు

చంద్రబాబు ఫ్రంట్ వర్సెస్ కేసీఆర్ ఫ్రంట్

ఇటీవలె జాతీయ రాజీయాలపై దృష్టి సారించిన చంద్రబాబు బీజేపేతర పక్షాలను ఏకం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పుడు కేసీఆర్ బీజేపీ-కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటు అంశం తెరపైకి తీసుకురావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల నాటికి చంద్రబాబు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా..లేదంటే కేసీఆర్ కోరుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు జరుగుందా అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

 

 

 

Read More