Home> జాతీయం
Advertisement

Karnataka Politics: 30 ఏళ్లుగా ఒకే కులంతో రాజకీయాలు, ఆ పార్టీ ఆయువు పట్టు అదే

Karnataka Politics: ఒకే ఒక్క కులంతో రాజకీయాలు చేయడం సాధ్యమేనా అంటే ఎందుకు కాదనే సత్యం బోధపడుతుంది. మతం, కులం ఎక్కడా కూడు పెట్టకపోయినా రాజకీయాల్లో మాత్రం పెడుతుందని అర్ధమౌతుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం.
 

Karnataka Politics: 30 ఏళ్లుగా ఒకే కులంతో రాజకీయాలు, ఆ పార్టీ ఆయువు పట్టు అదే

Karnataka Politics: సాధారణంగా ఎక్కడైనా సరే ఒకే మతం లేదా ఒకే కులంపై ఆధారపడి రాజకీయాల్లో మనుగడ సాధించడం కష్టమే. తాత్కాలికంగా సాధ్యం కావచ్చేమో గానీ దీర్ఘకాలంగా కుదరదనే రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. మరి ఆ రాష్ట్రంలో జరుగుతున్నదేంటి, అందుకు వ్యతిరేకంగా జరగడం లేదా..

మతాలు, కులాలు కూడు పెట్టవనేది నిజమే. కానీ రాజకీయాల్లో ఇవే కూడుపెడుతుంటాయి. చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో జరుగుతున్నదిదే. ఓట్లు రాల్చేందుకు, అధికారం దక్కించుకునేందుకు ఇప్పుడు మతమే ముఖ్యం, కులమే ప్రాధాన్యం. కుల మతాల ప్రాతిపదికన ఏ రంగంలో రాణించకపోయినా రాజకీయరంగంలో తప్పక రాణిస్తారు. మతం సంగతి కాస్త పక్కనబెడితే కులం ఆధారంగా రాజకీయాలు శాసిస్తున్న నేతల్లో జనతాదళ్ సెక్యులర్ వ్యవస్థాపకుడు దేవగౌడ. భారత మాజీ ప్రధాని దేవగౌడ దేశ రాజకీయాల్లో సుపరిచితులు. 

ఈయన, ఈయన కుమారుడు కుమారస్వామి నడుపుతున్న పార్టీ పేరైతే జనతాదళ్ సెక్యులర్. కానీ సెక్యులర్ భావం కన్పించదు. ఒకే కులం కన్పిస్తుంది. కేవలం ఒకే ఒక్క కులాన్ని నమ్ముకుని ఈ పార్టీ ఏకంగా 30 ఏళ్లుగా రాజకీయాలు చేస్తోంది కర్ణాటకలో. గత కొన్ని పర్యాయాలుగా కేవలం 25-30 సీట్లు మాత్రమే గెల్చుకుంటూ ఏకంగా రాష్ట్ర రాజకీయాల్నే శాసిస్తోంది. కింగ్ లేదా కింగ్ మేకర్ పాత్ర పోషిస్తోంది. కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ ఆధారపడిన కులం వొక్కలిక. దక్షిణ కర్ణాటక ప్రాంతంలో బలంగా ఉన్న ఈ కులం ఆధారంగానే జేడీఎస్ చాలాకాలంగా అక్కడి రాజకీయాల్లో మనుగడ సాధిస్తోంది. 

ఈ సామజికవర్గం జేడీఎస్‌కు లేదా దేవగౌడ కుటుంబానికి అండగా ఉన్నది ఇప్పట్నించి కాదు. 1994లో దేవగౌడ కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కొనసాగుతోంది. రాష్ట్రంలో బలమైన సామాజిక వర్గాలు రెండే రెండు. ఒకటి వొక్కలిగ కాగా రెండవది లింగాయత్‌లు. లింగాయత్‌లకు దీటుగా ప్రతి రంగంలో సై అంటే సై అనేది వొక్క లిగ మాత్రమే. అందుకే 1996లో దేవగౌడ దేశ ప్రధానమంత్రి కాగానే వొక్కలిగ సామాజిక వర్గం సంబరాలు చేసుకుంది. 

ఈ సామాజికవర్గం కర్ణాటక దక్షిణ ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా నాలుగు జిల్లాల్లో అత్యధికం. వొక్కలిగ సామాజిక వర్గం పైచేయిగా ఉన్న 9 జిల్లాల్లోని 61 స్థానాల్లో 2018లో జనతాదళ్ సెక్యులర్ 28 స్థానాలు గెల్చుకోగా, కాంగ్రెస్ 20, బీజేపీ 11 స్థానాలు సాధించింది. అంటే అత్యధిక వొక్కలిగ ఓటర్లు జేడీఎస్ పార్టీకు పట్టం కట్టారు. 

జనతాదళ్ పార్టీ తరవాత ఈ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా పడేవి కాంగ్రెస్ పార్టీకు. గతం నుంచి ఇదే జరుగుతోంది. లింగాయత్ ఓటు బ్యాంకుపై ఆధారపడి రాజకీయాలు చేస్తున్న బీజేపీ ఇప్పుడు వొక్కలిగ సామాజికవర్గాన్ని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సామాజికవర్గంలోని ముఖ్య నేత కెంపెగౌడ 108 అడుగుల విగ్రహం, శివమొగ ఎయిర్‌పోర్ట్‌కు కంపెగౌడ పేరు పెట్టడం, కెంపెగౌడ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు అన్నీ ఇందులో భాగమే.

ఏదేమైనా ఒకే ఒక్క కులం ఆధారంగా 30 ఏళ్లుగా రాజకీయాల్లో మనుగడ సాధిస్తుండటం కేవలం జనతాదళ్ సెక్యులర్ పార్టీకే చెల్లిందని చెప్పవచ్చు. 

Also read: Karnataka Exit Polls 2023: ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ వెనుకంజ, జీ న్యూస్, రిపబ్లిక్ టీవీ సహా అన్నీ కాంగ్రెస్ పార్టీకే పట్టం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More