Home> జాతీయం
Advertisement

Karnataka Minister B Sriramulu: కాపీ కొట్టి 10th పాసయ్యా.. నేను కాపీయింగ్‌లో పీహెచ్‌డీ చేశా! విద్యార్థులతో మంత్రి సంచలన వ్యాఖ్యలు

Karnataka Minister B Sriramulu said Iam a champion in cheating in exams. తాను కాపీ కొట్టే పదో తరగతి పాసయ్యానని, కాపీయింగ్‌లో తాను పీహెచ్‌డీ చేశానని కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీ శ్రీరాములు చెప్పారు. 

Karnataka Minister B Sriramulu: కాపీ కొట్టి 10th పాసయ్యా.. నేను కాపీయింగ్‌లో పీహెచ్‌డీ చేశా! విద్యార్థులతో మంత్రి సంచలన వ్యాఖ్యలు

Karnataka Minister B Sriramulu says I was passed 10th calss by cheating: కర్ణాటక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి బీ శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాపీ కొట్టే పదో తరగతి పాసయ్యానని, కాపీయింగ్‌లో తాను పీహెచ్‌డీ చేశానని చెప్పారు. పరీక్షల్లో కాపీ కొట్టడంలో తాను విజేతగా నిలిచానని విద్యార్థులతో చెప్పడం గమనార్హం. కర్నాటక మంత్రి శ్రీరాములు బళ్లారిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ముందు ఆయన మాట్లాడుతూ చదువుకునే రోజుల్లో కాపీ కొట్టిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

విద్యా వర్ధక్ సంఘ ఎస్‌జి ప్రీ-యూనివర్సిటీ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకల్లో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ... 'చదువుకునే రోజుల్లో నేను ట్యూషన్‌కు వెళ్లేవాడిని. అక్కడ రోజూ మిగతా విద్యార్థుల ముందు అవమానపడేవాడిని. టీచర్లు నన్ను అందరి ముందు తిట్టేవారు. నేను మూర్ఖుడిని అని అన్నారు. అయితే నేను పదో తరగతి పాసయ్యాక నా టీచర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. పరీక్షలో కాపీ కొట్టి పాసయ్యానని టీచర్‌కి చెప్పాను. చీటింగ్ చేయడంలో నేను ఛాంపియన్‌ని అని, కాపీయింగ్‌లో నేను పీహెచ్‌డీ చేశానని టీచర్‌కి చెప్పా' అని అన్నారు. 

'నేను క్లాస్‌లో బ్యాక్ బెంచర్‌ని. పరీక్షల సమయంలో మాల్‌ ప్రాక్టీస్‌ ఎలా చేయాలో పీహెచ్‌డీ చేశాను. నేను నా టీచర్లను బాగా ర్యాగ్ చేశాను. నేను జీన్స్ వేసుకున్నప్పుడు అమ్మాయిలు నన్ను అదోలా చూసేవారు. ఇక నేను 14 సార్లు జైలుకు వెళ్లాను. ఇవి సినిమాలోని డైలాగ్స్ అని మీరు అనుకుంటే పొరబడినట్టే. ఇది వాస్తవం. నేను పేదలను రక్షించడానికి మరియు పేదలకు న్యాయం చేయడానికి మాత్రమే రౌడీని. నేను చాలా చాలా మంచివాడిని' అని మంత్రి శ్రీరాములు చెప్పారు. 

'నేను ర్యాంక్ విద్యార్థిని కాదు. ఉపాధ్యాయులు చాలా మంది నన్ను చదివించాలని ప్రయత్నించారు. కాని నేను ఎందుకు చదువుకోలేకపోతున్నానో నాకు కూడా తెలిసేది కాదు. నా ఉపాధ్యాయులు చాలా మంది నన్ను తిట్టారు. కాలేజీ రోజుల్లో నాకు కన్నడతో పాటు ఏ భాష కూడా సరిగా రాదని హేళన చేశారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. నా గతం గురించి చెప్పడానికి నేను వెనుకాడను. విద్యార్థులు తమ లక్ష్యాలను సాధించేందుకు కష్టపడాలి. అప్పుడే మంచి జీవితాన్ని గడపగలరు' అని మంత్రి సూచించారు. అయితే ఓ మంత్రి ఇలా వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో పెద్ద వివాదాస్పదం అయ్యింది. మంత్రి హోదాలో ఉండి విద్యార్థుల ముందు అలానేనా మాట్లాడేది అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Janhvi Kapoor Bikini Pics: బీచ్ ఒడ్డున జాన్వీ కపూర్ కిర్రాక్ పోజులు.. వణికించే చలిలో హీటు పుట్టిస్తుందిగా!  

Also Read: మా దేశం తరఫున బరిలోకి దిగితే.. అన్ని మ్యాచుల్లో ఆడిస్తాం! సంజూ శాంసన్‌కు బంపర్‌ ఆఫర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Read More