Home> జాతీయం
Advertisement

Lakshmi Hebbalkar: ఆమెకు నిద్రపట్టాలంటే పెగ్ పడాల్సిందే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..

Lok sabha Elections 2024: బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్, పార్టీ కార్యకర్తల సమావేశంలో కర్ణాటకలో బీజేపీకి మహిళల మద్దతు పెరుగుతోందని అన్నారు. ఇది కాంగ్రెస్‌కు చెందిన లక్ష్మీ హెబ్బాల్కర్‌ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంగా మారాయి. 
 

Lakshmi Hebbalkar: ఆమెకు నిద్రపట్టాలంటే పెగ్ పడాల్సిందే.. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత..

Ex BJP MLA Sanjay Patil Controversial Comments On Minister Lakshmi Hebbalkar: దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధించాలని బీజేపీ భావిస్తుంటే, ఈసారై ఎన్నికలలో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ తహాతహాలాడుతుంది. ఈ క్రమంలో ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారంను కల్గించేవిగా మారాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంజయ్ పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందన్నారు. అదే విధంగా.. ఈ విషయం కాంగ్రెస్‌కు చెందిన శ్రీమతి హెబ్బాల్కర్‌ను చాలా ఆందోళనకు గురిచేస్తుందని అన్నారు. ప్రస్తుతం.. శ్రీమతి హెబ్బాల్కర్ కుమారుడు మృణాల్ బెలగావి స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Read More: Happy Sri Rama Navami 2024: మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శ్రీరామ నవమి ప్రత్యేక శుభాకాంక్షలు, కోట్స్ ఇలా పంపండి..

"బెళగావిలో బిజెపికి పెరుగుతున్న మహిళల మద్దతు చూస్తుంటే హెబ్బాల్కర్‌కి నిద్ర పట్టడం లేదు. అక్కడ రమేష్ జార్కిహోళి ప్రచారం చేయడం కూడా ఆమెకు కష్టంగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ మంత్రి హెబ్బాల్కర్‌కు రాత్రి పూట.. మంచి నిద్రకూడా పట్టట్లేదేమోనన్నారు. అందుకే ఆమె మంచి నిద్ర కోసం అదనపు పెగ్ తీసుకోవాల్సి ఉంటుందని స్థానికంగా బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాటిల్ అన్నారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ మాజీ ఎమ్మెల్యే  చేసిన వ్యాఖ్యలను ఎమ్మెస్ హెబ్బాల్కర్ ఒక వీడియో ప్రకటనలో ఖండించారు. మహిళల పట్ల బీజేపీకి ఎలాంటి గౌరవం ఉందో చెప్పడానికి పాటిల్ వ్యాఖ్యే ఉదాహరణ అని ఆమె ప్రశ్నించారు.

"ఇది బీజేపీకి మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుందన్నారు. ఇది బీజేపీ దాచిన ఎజెండా. బీజేపీ వాళ్లు.. జైశ్రీ రామ్, బేటీ పచావో, బేటీ పఢావో అని నినాదాలు చేస్తే సరిపోదు.. మీరు మహిళలను గౌరవించాలని హెబ్బాల్కర్ ఎదురుదాడికి దిగారు.

Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..

"మన హిందూ సంస్కృతి. హిందూ సంస్కృతి గురించి ప్రసంగాలు చేసే సంజయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఒక్క నాకే కాకుండా..  రాష్ట్ర, దేశంలోని మహిళలందరికీ అగౌరవపర్చడమే అని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా.. బెళగావిలో మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్ బీజేపీ అభ్యర్థి,  మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌తో పోటీ పడుతున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More