Home> జాతీయం
Advertisement

Karnataka Elections 2023: కర్ణాటకలో ప్రారంభమైన పోలింగ్, దేశంలోనే తొలిసారిగా..షెడ్యూల్ కంటే ముందే ఎందుకు

Karnataka Elections 2023: దేశమంతా ఇప్పుడు కర్ణాటక ఎన్నికలపైనే పడింది. అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే, పగ్గాలు చేపట్టి తీరాలని కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నా ఈసారి జరగనున్న కర్ణాటక ఎన్నికలు చాలా ప్రత్యేకమే అని చెప్పాలి.

Karnataka Elections 2023: కర్ణాటకలో ప్రారంభమైన పోలింగ్, దేశంలోనే తొలిసారిగా..షెడ్యూల్ కంటే ముందే ఎందుకు

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికలు మే 10న జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల ఫలితాలు మే 13వ తేదీన వెలువడనున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఈసారి కర్ణాటక ఎన్నికల్లో వినూత్న ప్రయోగం జరగనుంది. ఫలితంగా అప్పుడే అక్కడ పోలింగ్ ప్రారంభమైంది.

కర్ణాటక ఎన్నికల్లో 224 అసెంబ్లీ స్థానాలకు 2,613 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. బీజేపీ 224 స్థానాల్లో అభ్యర్ధుల్ని నిలబెట్టగా, కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్ధుల్ని దింపింది.  జేడీఎస్ మాత్రం 207 చోట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ 209 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక బీఎస్పీ నుంచి 133 మంది జేడీయూ నుంచి 8 మంది బరిలో నిలిచారు.

కర్ణాటకలో షెడ్యూల్ ప్రకారం మే 10వ తేదీనే పోలింగ్ జరగాల్సి ఉంది. దేశంలోనే తొలిసారిగా వినూత్న ప్రయోగం చేపడుతోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ప్రయోగం ఫలితంగా కర్ణాటకలో షెడ్యూల్ కంటే ముందే పోలింగ్ మొదలైంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..ముమ్మాటికీ నిజమిది. అదే వర్క్ ఫ్రం హోం తరహాలో ఓట్ ఫ్రం హోం. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోనే తొలిసారిగా ఓట్ ఫ్రం హోం ప్రారంభించింది. దీని ప్రకారం 80 ఏళ్లు దాటినవారు, అనారోగ్యంతో మంచానికి పరిమితమైనవాళ్లు, దివ్యాంగులు, విధుల్లో ఉన్న జర్నలిస్టులంతా ఇంటి నుంచే ఓటేసే అవకాశం పొందుతారు. ఈ ప్రక్రియ నిన్న అంటే ఏప్రిల్ 29న ప్రారంభమైంది. 

ఓట్ ఫ్రం హోం ఎలా

ఇంటి నుంచి ఓటేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఫారం 12డి  ప్రారంభించింది. ఈ ఫారం ద్వారా ఇంటి నుంటి ఓటేయవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 5 రోజుల్లో అందుబాటులో వచ్చింది. నిన్న ఏప్రిల్ 29 నుంచి ఓట్ ఫ్రం హోం ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో భాగంగా కర్ణాటకలో తొలిసారిగా ఈ అవకాశాన్ని సీనియర్ నటి లీలావతి ఓటుహక్కు వినియోగించుకున్నారు. వివిధ భాషల్లో 600కు పైగా సినిమాల్లో నటించిన ఈమె ముసలితనం కారణంగా మంచానికి పరిమితమయ్యారు. ఈ ప్రక్రియలో భాగంగా సంబంధిత ఓటరు ఇంటికి ఎన్నికల సిబ్బంది వెళ్లి..ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్‌మెంట్ ఏర్పాటు చేస్తారు. మరో వ్యక్తికి తెలియకుండా రహస్యంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఓట్ ఫ్రం హోం ప్రక్రియ మే 6 వరకూ కొనసాగుతుంది.

దేశంలో తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో జరుగుతున్న ఈ ప్రయోగం విజయవంతమైతే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ ఏడాది జరిగే తెలంగాణ ఎన్నికల్లో సైతం ఈ ప్రక్రియ అమలు చేయవచ్చు. 

Also read: Snakes seized at Chennai Airport: మహిళా ప్రయాణికురాలి నుంచి 22 పాములు, ఊసరవెల్లి స్వాధీనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More