Home> జాతీయం
Advertisement

వేలాది ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జియో సంస్థ

రిలయన్స్ జియోలో ఉద్యోగం కోల్పోయిన వారిలో అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ సిబ్బంది ఉండగా ఆ తర్వాత భారీ సంఖ్యలో పర్మినెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం.

వేలాది ఉద్యోగులకు షాక్ ఇచ్చిన జియో సంస్థ

ఏప్రిల్ మాసం వచ్చిందంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది కనుక తమ వేతనంలో ఏమైనా పెరుగుదల ఉంటుందేమో అని పలు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఆశించడం సర్వసాధారణం. అయితే, జియో సంస్థలోని ఉద్యోగులకు మాత్రం వేతనాలు పెరగడం మాట పక్కనపెడితే, ఖర్చు తగ్గింపు ప్రణాళికల్లో భాగంగా దాదాపు 5వేల మంది ఉద్యోగాలు ఊడిపోవడం సంస్థలోని ఉద్యోగులను కలవరపెడుతోంది. రిలయన్స్ జియోలో ఉద్యోగం కోల్పోయిన వారిలో అధిక సంఖ్యలో కాంట్రాక్ట్ సిబ్బంది ఉండగా ఆ తర్వాత భారీ సంఖ్యలో పర్మినెంట్ ఉద్యోగులు కూడా ఉన్నట్టు సమాచారం. మార్కెట్లో పోటీ పెరగడం, నిర్వహణ లాభం పెంచాల్సిన అవసరం రావడంతో జియో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

ఇదిలావుంటే, ఈ విషయంపై జియో సంస్థ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించినప్పటికీ... కొత్తగా చేర్చుకున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉందని చెప్పారు. నిరంతరం రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతుందని జియో అధికార ప్రతినిధి స్పష్టంచేశారు. ఏదేమైనా జియోలో చోటుచేసుకున్న ఈ పరిణామం టెలికాం రంగానికి చెందిన ఇతర సంస్థల ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.

Read More