Home> జాతీయం
Advertisement

Man Rides Scooter 1200 KM: భార్య పరీక్ష కోసం స్కూటర్ మీద 1200కి.మీ తీసుకెళ్లిన భర్త

Man Rides 1,200 Km for wife Exam | భార్యను స్కూల్ టీచర్‌ను చేయాలన్న లక్ష్యంతో ఏకంగా 1200 కి.మీ పైగా ఆమెను స్కూటర్‌పై తీసుకెళ్లాడు. తన భార్య ఇటీవల గర్భం దాల్చిందని, మొదట్లో భయపడినా.. నేను నిశ్చయించుకున్నానని నమ్మి ప్రయాణానికి ఒప్పుకుందని ఆనందంగా చెబుతున్నాడు ఆ భర్త.

Man Rides Scooter 1200 KM: భార్య పరీక్ష కోసం స్కూటర్ మీద 1200కి.మీ తీసుకెళ్లిన భర్త

అసలే వర్షాకాలం. ఆపై రోడ్లు గుంతలమయం. అయినా ఆ భర్త పెద్ద సాహసమే చేశాడు. భార్యను స్కూల్ టీచర్‌ను చేయాలన్న లక్ష్యంతో ఏకంగా 1200 కి.మీ పైగా ఆమెను స్కూటర్‌పై తీసుకెళ్లాడు (Man Rides 1,200 Km for wife Exam). తన భార్య ఇటీవల గర్భం దాల్చిందని, మొదట్లో భయపడినా.. నేను నిశ్చయించుకున్నానని నమ్మి ప్రయాణానికి ఒప్పుకుందని ఆనందంగా చెబుతున్నాడు ఆ భర్త. SBI: ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్‌

జార్ఖండ్‌కు చెందిన గిరిజన దంపతులు ధనంజయ్ కుమార్ (27), సోని హెంబ్రామ్ (22) జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లా గంటా టోలా గ్రామం నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు పరీక్షల నిమిత్తం స్కూటర్‌పై ప్రయాణించాల్సి వచ్చింది. డీఎడ్ (Diploma in Education) ఎగ్జామ్ సెంటర్‌కు జార్ఖండ్ నుంచి రావాలంటే బస్సులు లేవు, రైలు సౌకర్యం లేదు. ట్యాక్సీ తీసుకెళ్లాదంటే కనీసం రూ.30 వేలు పడుతుందని, ఆర్థిక స్థోమత సమకరించలేదన్నాడు ధనంజయ్. Natasa Stankovic Hot Pics: మోడల్ నటాషా స్టాన్‌కోవిక్ ఫొటోస్

8వ తరగతి వరకు చదివిన అతడు వంట మాస్టర్‌గా పనిచేసేవాడు. అయితే కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా అతడికి పని దొరకడం లేదు. దీంతో వారి వద్ద ఉన్న కొద్ది బంగారాన్ని అమ్మేశారు. తమ గ్రామం నుంచి గ్వాలియర్‌కు రావడానికి, ఇక్కడ రూము అద్దెకు రూ.5వేలు ఖర్చయ్యాయని పీటీఐతో మాట్లాడుతూ తెలిపాడు. 28వ తేదీన స్కూటర్ మీద బయలుదేరాం, ఓ రాత్రి బిహార్‌లోని ముజఫర్ నగర్‌లో, మరో రాత్రి లక్నోలో ఆగి విశ్రాంతి తీసుకోగా.. ఆగస్టు 30న గ్వాలియర్‌కు చేరుకున్నారు. మధ్యప్రదేశ్ సెకండరీ ఎడ్యూకేషన్ బోర్డ్ డీఎడ్ పరీక్షలను సెప్టెంబర్ 11కు నిర్వహిస్తుంది. Ravichandran Ashwin: జీవితంలో అవి అత్యంత చెత్త రోజులు 
 మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్ 

మేం వస్తుండగా మార్గం మధ్యలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అందరికీ తమ విషయం తెలిసిందని కుమార్ చెప్పాడు. తమ కష్టాన్ని గుర్తించిన గ్వాలియర్ కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ మాకు వసతి కల్పించాలని ఆదేశించడంతో పాటు రూ.5వేల ఆర్థిక సాయం అందించారని వివరించాడు. Metro New Timings: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గదర్శకాలు.. ట్రైన్ టైమింగ్స్ ఇవే 

‘మేం ఎన్నో కష్టాలు పడి ఇక్కడివరకు వచ్చాం. మధ్యలో వర్షం ఇబ్బంది పెట్టింది. దాంతో నాకు కాస్త జ్వరం వచ్చింది. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. జార్ఖండ్‌లో టీచర్ జాబ్‌కి అప్లై చేస్తే నేను కచ్చితంగా సెలక్ట్ అవుతానని’ సోని హెంబ్రామ్  ధీమా వ్యక్తం చేసింది. గత డిసెంబర్‌లో కుమార్, సోనిల వివాహం జరిగింది. Kurnool: యువకుడిపై మాజీ ప్రేయసి యాసిడ్ దాడి.. వారంలో రెండోసారి

Read More