Home> జాతీయం
Advertisement

ISRO Success: శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సి54 ప్రయోగం సక్సెస్, ప్రధాని మోదీ, సీఎం జగన్ అభినందనలు

ISRO Success: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నుంచి మరో ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ54 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఆ వివరాలు మీకోసం..

ISRO Success: శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సి54 ప్రయోగం సక్సెస్, ప్రధాని మోదీ, సీఎం జగన్ అభినందనలు

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో మైలురాయి సాధించింది. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమైన పీఎస్ఎల్వీ సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

ఏపీలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ సి 54 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోని ఈఓఎస్ 06, 8 చిన్న ఉపగ్రహాల్ని తీసుకెళ్లారు. సముద్రాలపై ఉన్న వాతావరణాన్ని కచ్చితంగా అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా ఇండియాకు చెందిన 1117 కిలోల బరువున్న ఈవోఎస్ 06, 18.28 కిలోల బరువున్న ఐఎన్ఎస్ 2బీ, 16.15 కిలోల బరువు కలిగిన ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ శాటిలైట్స్, 17.92 కిలోల బరువున్న యూఎస్‌కు చెందిన 4 యాస్ట్రా కాట్ ఉపగ్రహాల్ని నింగిలోకి పంపించారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం.

ఈ ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూ వాతావరణంపై పీఎస్ఎల్వీ సి54 అధ్యయనం చేయనున్నట్టు ఇస్రో తెలిపింది. పీఎస్ఎల్వీ సి54 ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ప్రధాని నరేంద్ర మోదీలు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

Also read: AP Politics: గంటా శ్రీనివాసరావు టీడీపీకు గుడ్ బై, త్వరలో వైసీపీలో చేరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More