Home> జాతీయం
Advertisement

PSLV C56 Launch: ఇస్రో నుంచి మరో భారీ ప్రయోగం, మరి కాస్సేపట్లో ఒకేసారి నింగిలోకి 7 ఉపగ్రహాలు

PSLV C56 Launch: మరి కొద్దిగంటల్లో ఇస్రో భారీ ప్రయోగం జరగనుంది. ఇవాళ ఉదయం 6.30 గంటలకు శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వి సి56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. పూర్తి స్థాయి కమర్షియల్ ప్రయోగం కావడంతో ఇతర దేశాల దృష్టి ఈ ప్రయోగంపై ఉంది. పూర్తి వివరాలు మీ కోసం..

PSLV C56 Launch: ఇస్రో నుంచి మరో భారీ ప్రయోగం, మరి కాస్సేపట్లో ఒకేసారి నింగిలోకి 7 ఉపగ్రహాలు

PSLV C56 Launch: చంద్రయాన్ 3 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన తరువాత అదే స్పేస్ సెంటర్ నుంచి ఇస్రో చేపట్టిన మరో భారీ ప్రయోగమిది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మరి కొద్ది గంటల్లో పీఎస్ఎల్వీ సి 56 రాకెట్..డీఎస్ ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని మోసుకెళ్లనుంది. 

ఇస్రో ఇవాళ చేపట్టిన ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో వాణిజ్యపరమైంది. ఇస్రో కమర్షియల్ ప్రయోగాల మిషన్‌లో భాగంగా న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తరపున చేపడుతున్న ప్రయోగం ఇది. సింగపూర్ దేశానికి చెందిన 7 ఉపగ్రహాల్ని పీఎస్ఎల్వీ సి56 రాకెట్ ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి పంపనుంది. పీఎస్ఎల్వీ సి56 రాకెట్ ద్వారా సింగపూర్ దేశానికి చెందిన డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహంతో పాటు మరో ఆరు ఉపగ్రహాలను నింగిలోకి పంపించనున్నారు. సింగపూర్ ప్రభుత్వ ఎజెన్సీలకు అవసరమైన ఛాయా చిత్రాల కోసం డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. 

మరోవైపు డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహంతో పాటు టెక్నాలజీ డెమోన్‌స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్ -ఏఎం, ఎక్స్‌పెరిమెంటల్ శాటిలైట్ ఆర్కేడ్, 3 యూ నానో శాటిలైట్ స్కూబ్-2, ఐవోటి కనెక్టివ్ నానో శాటిలైట్ సూలయాన్, గలాసియా-2, ఓఆర్బీ-12 స్ట్రైడర్ శాటిలైట్లను పీఎస్ఎల్వీ సి 56 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లి..కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. మరి కాస్సేపట్లో అంటే ఉదయం 6.30 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది. పీఎస్ఎల్వీ సి 56 రాకెట్ మోసుకెళ్తున్న డీఎస్-ఎస్ఏఆర్ ఉపగ్రహం బరువు 360 కిలోలు కావడం గమనార్హం.

ప్రధాన ఉపగ్రహం DS-SARతో పాటు ఇతర ఆరు ఉపగ్రహాల పేర్లు ఇలా ఉన్నాయి. 1. Velox-AM 2. Arcade 3. Scoob-II 4. NuLion NuSpace Pvt ltd, Singapore 5. Galassia -2 6. ORB-12 strider

సింగపూర్ దేశపు డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ , ఎస్టీ ఇంజనీరింగ్ భాగస్వామ్యంతో ఈ ఉపగ్రహం రూపొందింది. పూర్తి స్థాయి కమర్షియల్ ప్రయోగం కావడంతో ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇప్పటికే ఇస్రో శాస్త్రవేత్తలు శ్రీవారి చెంత నమూనా రాకెట్ ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Also read: Milk Price Hiked: పెరిగిన పాల ధర.. సామాన్యుల పరిస్థితి ఎలా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More