Home> జాతీయం
Advertisement

Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్

భారత్‌లో స్లీపర్ సెల్స్‌ని, ఏజెంట్స్‌ని రిక్రూట్ చేసుకునేందుకు ఐఎస్ఐ హని ట్రాప్ ( ISI honey trap ) పద్ధతిని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియక హనీ ట్రాప్ ( Honey trap ) ఉచ్చులో చిక్కుకుని కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు, ఐఎస్ఐకి ఏజెంట్స్‌గా ( ISI agents ) మారుతున్న ఉదంతాలు కూడా తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి.

Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్

భారత్‌లో స్లీపర్ సెల్స్‌ని, ఏజెంట్స్‌ని రిక్రూట్ చేసుకునేందుకు ఐఎస్ఐ హని ట్రాప్ ( ISI honey trap ) పద్ధతిని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియక హనీ ట్రాప్ ( Honey trap ) ఉచ్చులో చిక్కుకుని కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులకు, ఐఎస్ఐకి ఏజెంట్స్‌గా ( ISI agents ) మారుతున్న ఉదంతాలు కూడా తరచుగా వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా అటువంటి మరో ఐఎస్ఐ హనీ ట్రాప్ ఘటననే మిలిటరీ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ, ఉత్తర్ ప్రదేశ్ యాంటీ టెర్రర స్క్వాడ్ ( ATS ) పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో బయటపడింది. ఆపరేషన్ గోరఖ్‌‌దందా ( Op Gorakhdhanda ) పేరిట కొనసాగిన ఈ మిలిటరీ ఆపరేషన్‌లో అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకొచ్చాయి. Also read : North Korea: కోమాలో కిమ్.. చెల్లెలు చేతికి పగ్గాలు.. సీక్రెట్ ఏజెంట్స్ వెల్లడి

ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఓ టీ స్నాక్స్ దుకాణం నిర్వహిస్తూ బతుకు బండి లాగిస్తున్న మొహమ్మద్ ఆరిఫ్‌కి కరాచిలో ( Karachi ) కొంతమంది సమీప బంధువులు ఉన్నారు. ఆరిఫ్ సొంత సోదరి జరినాను కూడా కరాచికే చెందిన షాహీద్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. 2014లో ఆరిఫ్ భార్య చనిపోయింది. అప్పటి నుంచి పెళ్లి చేసుకోకుండానే ఉంటున్న ఆరిఫ్ 2014 నుంచి 2018 డిసెంబర్ వరకు నాలుగుసార్లు కరాచిలో ఉన్న తన సోదరి జరీనా వద్దకు వెళ్లొచ్చాడు. దీంతో అప్పుడప్పుడు కరాచికి వెళ్లి వస్తున్న ఆరిఫ్‌పై పాకిస్తాన్ ఐఎస్ఐ కన్నుపడింది. 

అలా చివరిసారిగా ఆరిఫ్ పాకిస్తాన్ వెళ్లినప్పుడు ఇద్దరు వ్యక్తులు జరినా ఇంటికి వచ్చారు. తమని తాము ఫహద్, రానా అఖీల్ అని పరిచయం చేసుకుని తాము వీసా వెరిఫికేషన్ ( Visa verification ) విభాగం నుంచి వచ్చిన అధికారులం అని తెలిపారు. వీసా వెరిఫికేషన్ కోసం వచ్చామని చెప్పి వెరిఫెకేషన్ పూర్తి చేసుకుని వెళ్లిన ఫహద్, రానా.. ఆ తర్వాత ఇంకొన్ని రోజులకు మళ్లీ జరినా ఇంటికి వచ్చారు. అలా తరచుగా జరినా ఇంటికి వస్తూ ఆరిఫ్‌తో అతడి సోదరి కుటుంబంతో స్నేహం నటించారు. ఆ తర్వాత ఆరిఫ్‌ని సైతం కరాచిలో అందమైన ప్రదేశాలకు, షాపింగ్ మాల్స్‌కి తీసుకెళ్లి అతడికి ఆయా ప్రదేశాలు చూపించే సాకుతో స్నేహం పెంచుకున్నారు. Also read : India vs China: సైనిక చర్యకు సిద్ధం.. చైనాకు రావత్ వార్నంగ్

ఆరిఫ్ భారత్‌కి తిరిగొచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అతడిని ఓ లాడ్జికి తీసుకెళ్లిన ఫహద్, రానాలు.. అక్కడ జీన్స్ ప్యాంట్, టీ షర్ట్ ధరించిన ఓ అందమైన సెక్స్ వర్కర్‌ని ( Sex worker ) పరిచయం చేసి ఆమెతో సెక్స్ ఎంజాయ్ చేసే అవకాశం కల్పించారు. ఆ సెక్స్ వర్కర్‌ని చూసి టెంప్ట్ అయిన ఆరిఫ్.. వెంటనే వాళ్లు ఇచ్చిన ఆఫర్‌కి క్షణం ఆలస్యం చేయకుండా ఓకె చెప్పి ఆమెతో ఆ రాత్రి అక్కడే ఎంజాయ్ చేశాడు. 

పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ Sex worker తో హని ట్రాప్‌కి పాల్పడటంతోనే ఆరిఫ్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. తన స్నేహితులు తన కోసం విందు, పొందు ఏర్పాటు చేశారనే అనుకున్నాడు కానీ అది హనీ ట్రాప్ అని అప్పుడు ఆరిఫ్ గుర్తించలేదు. సెక్స్ వర్కర్‌తో ఆరిఫ్ ఉన్న గదిలో అనేక హిడెన్ కెమెరాలను ఏర్పాటు చేసిన ఫహద్, రానా.. ఆమెతో అతడి రాసలీలలు ( Videos caught on hidden cameras ) అన్ని రికార్డు చేశారు. ఆ తర్వాత ఆరిఫ్ కరాచి నుంచి భారత్‌కి తిరిగొచ్చాడు. ఆరిఫ్ అక్కడి నుంచి వచ్చే ముందు అతడికి +92 తో స్టార్ట్ అయ్యే తమ ఫోన్ నెంబర్ రాసిచ్చారు. Also read : Cai Hong-4 UAVs : చైనాతో కలిసి పాకిస్తాన్ మరో కుట్ర

ఆరిఫ్ పాకిస్తాన్ నుంచి వచ్చిన కొద్ది రోజులకు పాకిస్తాన్ నుంచి ఓ వాట్సాప్ కాల్ వచ్చింది. పాకిస్తాన్‌లో ఫహద్ ఇచ్చిన నెంబర్ నుంచే ఆ కాల్ వచ్చింది. ఆరిఫ్ యోగక్షేమాలు కనుక్కున్న ఫహద్.. ఇది తన నెంబర్ అని చెప్పి సేవ్ చేసుకొమ్మని చెప్పాడు. ఆరిఫ్ సైతం భాయ్ పేరిట ఆ నెంబర్‌ని సేవ్ చేసుకున్నాడు. ఆ తరువాత ఇంకొన్ని రోజులకు మరోసారి ఫోన్ చేసిన ఫహద్... '' గోరఖ్‌పూర్‌లోని జాఫ్ర బజార్ ఫోటోలు ( Zafra Bazaar in Gorakhpur ) పంపాల్సిందిగా'' ఆరిఫ్‌ని కోరాడు. ఫహద్ అమాయకంగా నటిస్తున్నాడనే విషయాన్ని గుర్తించని ఆరిఫ్.. అతడు కోరినట్టే ఆ ఫోటోలు పంపించాడు. 

ఆ తర్వాత ఇంకొన్ని రోజులకు మరోసారి ఫోన్ చేసిన ఫహద్.. ఈసారి గోరఖ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఫోటోలు ( Gorakhpur Air Force Station ) పంపించాల్సిందిగా కోరాడు. ఐతే ఈసారి ఫహద్ కోరికను ఆరిఫ్ సున్నితంగానే తిరస్కరించాడు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఫోటోలు తీసి పంపడం నేరం అని భావించిన ఆరిఫ్.. అదే విషయాన్ని ఫహద్‌కి చెప్పి తాను ఆ పని చేయలేనన్నాడు. అప్పుడే ఫహద్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. కరాచిలో ఆరిఫ్ సెక్స్ వర్కర్‌తో గడిపినప్పటి ఫోటోలు, వీడియోలు వాట్సాప్‌లో పంపించి బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. తమ కోసం పనిచేయకపోతే. తాము చెప్పినట్టుగా వినకపోతే.. ఆ ఫోటోలు, వీడియోలు కరాచిలో ఉన్న నీ సోదరి జరీనాకు చేరవేస్తామని బెదిరించారు. దీంతో ఆరిఫ్‌కి ఇక వారికి లొంగిపోక తప్పలేదు. అలా ఆరిఫ్ నుంచి ఓ సిమ్ కార్డు ( SIM card ) కొనుగోలు చేయించిన పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు.. ఆ నెంబర్‌పై ఆరిఫ్ చేతే ఓటిపి ( Whatsapp OTP ) తెప్పించుకుని ఇండియన్ వాట్సాప్ నెంబర్ యాక్టివేట్ చేయించారు. Also read : Sinopharm's vaccine: చైనా కరోనా వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా ?

పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్స్ ( Pakistan ISI agents ) కోసం తన అడ్రస్‌తోనే సిమ్ కార్డు తీసుకున్న ఆరిఫ్.. ఆ నెంబర్‌పై వాట్సాప్ యాక్టివేట్ అయిన తర్వాత ఆ సిమ్ కార్డుని తన ఫోన్ లోంచి తీసేశాడు. మరోవైపు ఐఎస్ఐ సైతం ఆ వాట్సాప్ నెంబర్‌తో ( Whatsapp number ) భారత్‌లో ఉన్న భద్రతా బలగాలకు గాలం ( Honey trap in security forces ) వేసేందుకు ఉపయోగిస్తూనే ఉందని మిలిటరి ఇంటెలిజెన్స్ విచారణలో బయటపడింది.

గోరఖ్‌పూర్ ( Gorakhpur ) నుంచి పాకిస్తాన్‌లోని కరాచికి మధ్య తరచుగా ఓ మొబైల్ నెంబర్‌పై సమాచార మార్పిడి జరుగుతున్నట్టు గుర్తించిన జమ్ముకశ్మీర్‌లోని మిలిటరీ ఇంటలీజెన్స్ వర్గాలు ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో ఉన్న తమ విభాగం అధికారులకు ఇదే ఏడాది జూన్ నెలలోనే ఆ విషయాన్ని తెలియజేశారు. జమ్ముకాశ్మీర్ మిలిటరీ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన లక్నో మిలిటరీ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ.. '' ఆపరేషన్ గోరఖ్‌దందా'' పేరిట ఓ సీక్రెట్ ఆపరేషన్ ప్రారంభించారు. గోరఖ్‌పూర్‌లో ఆ మొబైల్ నెంబర్ సిగ్నల్స్ ఆధారంగా ఆరిఫ్‌ని గుర్తించిన మిలిటరీ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ అధికారులు.. అతడి కదలికలపై కన్నేసి రహస్యంగా అతడిని అనుసరించారు. తమ విచారణలో కనుగొన్న అంశాలను లక్నో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ పోలీసులతో పంచుకున్నారు. Also read : Pakistan vs Saudi Arabia: పాకిస్థాన్‌కి సౌది అరేబియా భారీ షాక్

లక్నో మిలిటరీ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ, లక్నో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు రంగంలోకి దిగి 51 ఏళ్ల ఆరిఫ్‌ని అదుపులోకి తీసుకున్నారు. గత శుక్రవారం, శనివారం ఆరిఫ్‌ని ప్రశ్నించగా అతడు తన నేరాన్ని అంగీకరించాడు. ఎటువంటి పరిస్థితుల్లో తాను ఈ పని చేయాల్సి వచ్చిందనే విషయాలన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు. గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ( Gorakhpur Railway Station ), ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గేట్స్, కుంద్రా ఘాట్ మిలిటరీ స్టేషన్ ఫోటోలను ఫహద్, రానాలకు పంపించినట్టు ఆరిఫ్ తెలిపాడు.

ఇండియన్ ఆర్మీలో పనిచేసే సైనికులను కానీ లేదా మిలిటరీ స్టేషన్స్‌కి వెళ్లే సిబ్బంది ఎవరినైనా తమకు పరిచయం చేయాల్సిందిగా ఫహద్, రానాలు ఆరిఫ్ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. ఐతే వారికి ఆ సహాయం చేయడం ఇష్టం లేని ఆరిఫ్.. ఆ తర్వాత వారితో మాట్లాడటం క్రమక్రమంగా తగ్గించేసుకున్నాడు. అనంతరం ఇంటర్నెట్ వినియోగించడమే ఆపేశాడు. అదే సమయంలో షామా పర్వీన్ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్న ఆరిఫ్... తన రెండో పెళ్లి తర్వాత ఐఎస్ఐ ఏజెంట్స్ నుంచి ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని భావించాడు. ఆ క్రమంలోనే జూలై 14న తన ఫోన్‌ని ఫార్మాటింగ్ కూడా చేయించాడు. 

ఐఎస్ఐ ఏజెంట్స్ చేతుల్లో ఆరిఫ్ మోసపోయాడని గుర్తించిన యాంటి టెర్రర్ స్క్వాడ్ పోలీసులు, మిలిటరీ ఇంటెలీజెన్స్ ఏజెన్సీ అధికారులు అతడికి కౌన్సిలింగ్ నిర్వహించి మరోసారి ఇలాంటి పనిచేయకూడదని హెచ్చరించి ఇంటికి పంపించేశారు. పాకిస్తాన్‌కి వెళ్లొచ్చే భారతీయ ముస్లింలను, నిరుపేద ముస్లింలను ఐఎస్ఐ ఎలా హనీ ట్రాప్‌లోకి దించుతోందనేది ఈ ఘటనతో మరోసారి రుజువైంది. Also read : Dawood Ibrahim: సెక్యూరిటీ ఏజెన్సీ చేతిలో దావూద్ పాస్ పోర్ట్ వివరాలు

Read More