Home> జాతీయం
Advertisement

President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఉంటారా? కేసీఆర్ నిలబెట్టేదీ ఆయననేనా?

President Election: భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. జూలై 18న దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రెసిడెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో బలాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్లెన్ని.. ఏ పార్టీకి ఎంత బలం ఉంది.. ఎన్డీఏకు మెజార్టీ ఉందా.. విపక్షాలు బరిలో ఉంటాయా అన్న చర్చలు సాగుతున్నాయి

President Election: రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఉంటారా? కేసీఆర్ నిలబెట్టేదీ ఆయననేనా?

President Election: భారత రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. జూలై 18న దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. ప్రెసిడెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో బలాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఓట్లెన్ని.. ఏ పార్టీకి ఎంత బలం ఉంది.. ఎన్డీఏకు మెజార్టీ ఉందా.. విపక్షాలు బరిలో ఉంటాయా అన్న చర్చలు సాగుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికలే టార్గెట్ గా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారనే ప్రచారం ఉంది. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడంతో గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు.. ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలుపుతారా.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను కేసీఆర్ ఏకం చేస్తారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ కూటమికి ఎక్కువ ఓట్లున్నాయి. కాని కావాల్సిన మెజార్టీకి కొన్ని ఓట్లు అవసరం. ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలవాలంటే ఎన్డీఏకు 5 లక్షల 49 వేల 452 ఓట్లు అవసరం. పార్లమెంట్ సభ్యుల ఓట్లలో బీజేపీకి కూటమికి  3 లక్షల 20 వేల ఓట్లుండగా.. ప్రతిపక్షాలకు లక్షా 72 వేల ఓట్లు ఉన్నాయి. అయితే శాసనసభ్యుల్లో మాత్రం బీజేపీ కంటే విపక్షాలకు మెజార్టీ ఉంది. ఎన్డీఏకు 2 లక్షల 22 వేల ఓట్లు ఉండగా.. ప్రతిపక్షాలకు మాత్రం 2 లక్షల 77 వేల ఓట్లున్నాయి. ఇందులో ప్రాంతీయ పార్టీల ఓట్లే ఎక్కువ. మొత్తంగా బీజేపీ గెలవాలంటే దాదాపు 13 వేల ఓట్లు అవసరమని తెలుస్తోంది. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్డీఏకు పూర్తి బలం లేదు. టీఆర్ఎస్, వైసీపీ, శివసేన, జేడీయూ పార్టీలు రాంనాథ్ కోవింద్ కు అప్పుడు మద్దతు ఇచ్చాయి.

ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. 2017 ఎన్నికల్లో బీజేపీ కూటమి అభ్యర్థికి మద్దతు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్..ఇప్పుడు వాళ్లపై భగ్గుమంటున్నారు. బీజేపీ వ్యతిరేక  పార్టీలను ఏకం చేస్తున్నారు. గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన శివసేన కూడా ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉంది. జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కొన్ని రోజులుగా బీజేపీతో విభేదిస్తున్నారు. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవాలంటే బీజేపీకి బీజేడీ లేదా వైసీపీ మద్దతు కచ్చితంగా అవసరం. అందుకే కేసీఆర్ ఏం చేయబోతున్నారన్నది కీలకంగా మారింది. దేశంలో సంచలనం జరగబోతోందని పదేపదే చెబుతున్నారు కేసీఆర్. ఆ సంచలనం రాష్ట్రపతి ఎన్నికల్లో జరగబోతుందా అన్న చర్చ ఉంది. విపక్షాలను ఏకం చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని కేసీఆర్ బరిలో నిలుపుతారనే చర్చ తెరపైకి వచ్చింది. కాని అది సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్న.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో చర్చలు జరిపారు. ఎన్‌సీపీ నేత శరద్ పవార్, ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తో మంతనాలు చేశారు. బెంగళూరులో మాజీ ప్రధాని దేవెగౌడతో పలు దఫాలుగా చర్చించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను గతంలో ఓసారి కలిశారు. త్వరలో మరోసారి ఆయనతో సమావేశం కాబోతున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ కేసీఆర్ సమావేశమయ్యారు. బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. బీజేడీ అధినేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోనూ కేసీఆర్ చర్చలు జరపబోతున్నారని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేడీ ఓట్లు కీలకంగా ఉండటం ఆసక్తిగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కేసీఆర్ తన వైపు తిప్పుకుంటే బీజేపీని ఇరుకున పెట్టవచ్చన్నది టాక్.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్న కేసీఆర్.. అభ్యర్థి విషయంలోనూ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రకు చెందిన సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో పాటు మాజీ ప్రధాని దేవెగౌడ పేర్లను కేసీఆర్‌ ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. వీళ్లిద్దరిని ఇటీవలే కలిశారు కేసీఆర్. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ విషయంపైనే చర్చించారని తెలుస్తోంది. అయితే కేసీఆర్ ప్రతిపాదనను దేవేగౌడ తిరస్కరించారని అంటున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరును కేసీఆర్ అనుకున్నా.. సీఎం పోస్టును వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. దీంతో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసివస్తే సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారేను ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారనే చర్చ సాగుతోంది. అయితే విపక్ష పార్టీలన్ని కలిసివస్తేనే కేసీఆర్ ముందుకు వెళతారని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ సీఎం జగన్ బీజేపీకి వ్యతిరేకంగా ఉండే అవకాశం లేదు. దీంతో కేసీఆర్ వ్యూహాలు ఫలించకపోవచ్చనే అభిప్రాయమే పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తోంది.

READ ALSO: US Shooting: ఫ్యాక్టరీలో ముగ్గురు కాల్చివేత.. అమెరికాలో మళ్లీ కాల్పుల మోత

READ ALSO: JOB News: యవతకు గుడ్‌న్యూస్, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లో త్వరలో 90 వేల ఉద్యోగాల భర్తీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Read More