Home> జాతీయం
Advertisement

కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్

Arvind Kejriwal | మరో నాలుగు రోజుల్లో ఎన్నికలుండగా ఆప్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీట్ పేల్చారు.

కేజ్రీవాల్‌ను టార్గెట్ చేసిన బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తమ మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. నాణ్యమైన, విద్య, ఆహారం, 24 గంటల విద్యుత్, స్వచ్ఛమైన నీరుతో పాటు కాలుష్యాన్ని మూడింట ఒక వంతు తగ్గిస్తామని ఆప్ హామీలను మేనిఫెస్టోలో ప్రకటించింది. జన లోక్‌పాల్ బిల్లు ఆమోదం కోసం కేంద్రంతో పోరాటం కొనసాగిస్తామని ఆప్ స్పష్టం చేసింది. ఆప్ తమ మేనిఫెస్టో విడుదల చేసిన రోజే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌‌ను లక్ష్యంగా భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రా లేక ముఖ్య నటుడా అని చలోక్తులు విసిరారు.

Also Read; BJP 40స్థానాలకు పైగా గెలుస్తుంది: అమిత్ షా

‘జన లోక్ పాల్ బిల్లు కోసం పోరాటం చేసిన సామాజిక కార్యకర్త అన్నా హజారేతో అబద్ధం.. గతంలో తన స్నేహితులకు అబద్ధాలు.. ఆపై వేలాది ఢిల్లీ ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారు. అసలు ఈయన ముఖ్యమంత్రినా.. లేక ముఖ్య నటుడా అంటూ’ పొలిటికల్ సెటైర్ పేల్చారు గంభీర్. అన్నా హజారాతో కేజ్రీవాల్ ఏదో చెబుతున్నట్లుగా ఉన్న ఫొటోను గంభీర్ తన ట్వీట్‌తో షేర్ చేశారు. 

Also Read: జన్ లోకపాల్, దేశభక్తి ప్రధానాంశాలుగా ఆప్ మేనిఫెస్టో

2024కల్లా ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని బీజేపీ చెబుతోంది.  ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పథకాలను ఢిల్లీ నగరంలో అమలు చేస్తామని హామీ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి రూ.2కే కిలో గోధుమ పిండి అందజేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. కాగా, గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి గంభీర్ విజయం సాధించారు. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 11న ఫలితాలు విడుదల కానున్నాయి.

Also Read: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆస్తుల విలువెంతో తెలుసా?

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More