Home> జాతీయం
Advertisement

Covid19 Vaccine: భూమిపై అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా అందించాలి

కరోనా వ్యాక్సిన్  విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఆశలు చిగురిస్తున్న నేపధ్యంలో..ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భూ మండలంపై ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని సూచించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరి కొద్దిరోజుల్లోనే కరోనా వ్యాక్సిన్ ( Corona vaccine ) అందుబాటులో రానుంది. డిసెంబర్ నాటికి లభిస్తుందనే నమ్మకం కలుగుతోంది. ఈ నేపధ్యంలో అసలీ వ్యాక్సిన్ ఖరీదు ఎంత ఉంటుందనే విషయంపై ఆందోళన నెలకొంది. సామాన్యులకు వ్యాక్సిన్ అందుతుందా అనేది సందేహంగా మారింది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ( Infosys Narayana murthy ) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భూమిపై ఉన్న ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉండాలని నారాయణ మూర్తి సూచించారు. వ్యాక్సిన్ వ్యయాన్ని భరించేందుకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలన్నారు. ఐక్యరాజ్యసమితి ( UNO ) సభ్యదేశాలు ఈ ఖర్చులో మేజర్ షేర్ భరించాలని కోరారు.

వ్యాక్సిన్ ఉత్పత్తి ఖర్చుల్ని పెద్ద పెద్ద సంస్థలు భరించాలని..ఎక్కువ లాభాల్ని ఆశించకూడదని నారాయణ మూర్తి తెలిపారు. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే అందరికీ ఉచితంగా కోవిడ్-19 ( Covid 19 ) వ్యాక్సిన్‌ అందిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman ) చెేసిన వ్యాఖ్యల్ని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అటు శాశ్వత వర్క్ ఫ్రం హోం విధానంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  Also read: Indian vaccines: అడ్వాన్స్ దశకు చేరుకున్న రెండు స్వదేశీ కరోనా వ్యాక్సిన్‌లు

Read More