Home> జాతీయం
Advertisement

Vande Bharat: ఫిబ్రవరికి వందేబారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, డిజైన్ ఎలా ఉంటుందంటే

Vande Bharat: దేశంలో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో రైళ్ల సంఖ్య కూడా ఎక్కువైంది. అయితే స్లీపర్ కోచ్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారడంతో ఆ సౌకర్యం కూడా త్వరలో అందుబాటులో రానుంది.

Vande Bharat: ఫిబ్రవరికి వందేబారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, డిజైన్ ఎలా ఉంటుందంటే

Vande Bharat: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన సెమీ హైస్పీడ్ రైళ్లుగా వందేభారత్ రైళ్లు  దేశంలోని ప్రధాన నగరాలను కలుపుతూ పరుగులు తీస్తున్నాయి. ఈ రైళ్లకు క్రేజ్ పెరగడంతో రైల్వే శాఖ రైళ్ల సంఖ్యను కూడా పెంచుతోంది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 33 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య నడుస్తున్న ఈ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. చాలా వరకూ రైళ్లు ఫుల్ ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. పండుగ సీజన్లలో అయితే టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ టికెట్లతో పోలిస్తే ఎక్కువే అయినా ప్రయాణ సమయం తక్కువ కావడంతో అందరూ వందేభారత్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు. అన్నీ ఉన్నా స్లీపర్ కోచ్‌లు లేకపోవడం వందేభారత్ రైళ్లలో ప్రధాన లోపంగా ఉంది. అయితే ఈ లోపాన్ని సరిచేసేందుకు రైల్వే శాఖ స్లీపర్ కోచ్‌లు త్వరలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా స్లీపర్ కోచ్ రైళ్లు ఎలా ఉంటాయో డిజైన్ విడుదల చేసింది. 

2024 ఫిబ్రవరి నాటికి స్లీపర్ కోచ్ రైళ్లు ప్రవేశపెట్టేందుకు ప్లానింగ్ సిద్ధమౌతోంది. ఈ స్లీపర్ కోచ్ రైళ్లను చాలా వినూత్నంగా తీర్చిదిద్దేందుకు రైల్వే ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మాణంలో ఉన్నాయి. ఈ రైళ్లలో మొత్తం 857 బెర్త్‌లు ఉంటే అందులో 823 బెర్త్‌లను ప్రయాణీకుల కోసం కేటాయిస్తున్నారు.

మిగిలినవి విధి నిర్వహణలో ఉండే రైల్వే ఉద్యోగులు, సిబ్బందికి కేటాయిస్తారు. ఒక్కో కోచ్ లో నాలుగు కాకుండా మూడు టాయ్‌లెట్లు ఉంటాయి. ఒక మినీ ప్యాంట్రీలా ఉంటుంది. వందేభారత్ స్లీపర్ కోచ్‌లలో దివ్యాంగులకు అనువుగా ఉండేందుకు ర్యాంప్ అందుబాటులో తీసుకురానుంది.

Also read: Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీ, తెలంగాణల్లో మరో 3 రోజులు భారీ వర్షసూచన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More