Home> జాతీయం
Advertisement

IAC Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేల ప్రారంభ వేతనం.. పూర్తి వివరాలివే..

Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో వివిధ శాఖల్లో 71 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అసిస్టెంట్ కమాండర్ హోదా కలిగిన జాబ్స్ కూడా ఉన్నాయి. 

IAC Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.56 వేల ప్రారంభ వేతనం.. పూర్తి వివరాలివే..

Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో వివిధ శాఖల్లో 71 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అసిస్టెంట్ కమాండర్ హోదా కలిగిన జాబ్స్ కూడా ఉన్నాయి. మంచి వేతనంతో కూడిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఖాళీలు, వయోపరిమితి, వేతనం, ముఖ్య తేదీలు, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం... 

ఖాళీలు, విద్యార్హతలు.. :

జనరల్ డ్యూటీ - ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
పైలట్ లైసెన్స్ (సీపీఎల్)- 12వ తరగతి ఉత్తీర్ణత, వాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్
టెక్నికల్ (మెకానికల్), టెక్నికల్ (ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్)- ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ ఉత్తీర్ణత
లా ఎంట్రీ - ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి లా డిగ్రీలో ఉత్తీర్ణత.

వయో పరిమితి :

అభ్యర్థుల వయసు 25 ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు తగినట్లుగా సడలింపు ఉంటుంది.

వేతనం : 

అసిస్టెంట్ కమాండెంట్ హోదా కలిగిన ఉద్యోగాలకు పేస్కేల్ 10 వర్తిస్తుంది. దానిప్రకారం నెలకు రూ.56,100 బేసిక్ పే ఉంటుంది. ఇతర ఉద్యోగాలకు పేస్కేల్‌ను బట్టి వేతనం వర్తిస్తుంది.

ముఖ్య తేదీలు :

ఆగస్టు 17, 2022 నుంచి సెప్టెంబర్ 7, 2022 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్ 1)
కంప్యూటరైజ్డ్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ (స్టేజ్ 2)
సైకాలజికల్ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ (స్టేజ్ 3)
ఇండక్షన్ (స్టేజ్ 5)

ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలకు అభ్యర్థులు joinindiancoastguard.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు అనుమతించరు. అభ్యర్థులు డెడ్ లైన్ వరకు వేచి చూడకుండా ముందే అప్లై చేసుకుంటే చివరి నిమిషంలో హడావుడి పడాల్సిన అవసరం ఉండదు.

Also Read: Nalgonda Murder: నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త హత్యలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం?

Also Read: Bhadrapada Tips: భాద్రపద మాసంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పనులు చేయవద్దు... వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More