Home> జాతీయం
Advertisement

Corona cases in India: దేశంలో కొత్తగా 6,987 కరోనా కేసులు, 162 మరణాలు

Corona cases in India: దేశంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోసారి 7 వేల దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కాస్త తగ్గాయి.

Corona cases in India: దేశంలో కొత్తగా 6,987 కరోనా కేసులు, 162 మరణాలు

India corona Update: దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,987 మందికి కరోనా నిర్ధారణ అయినట్లు (Corona new cases in India) కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అదివారం ప్రకటించింది. మొత్తం 9,45,455 మందికి కొవిడ్ టెస్టులకు గానూ..ఈ కేసులు బయటపడినట్లు తెలిపింది.

కరోనా మరణాల్లోనూ క్షీణత నమోదైంది. కొవిడ్ కారణంగా గడిచిన 24 గంటల్లో 162 మంది ప్రాణాలు (Corona Deaths in India) కోల్పోయారు. 7,091 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.

దేశంలో ఒమిక్రాన్ ఆందోళనలు మాత్రం తీవ్రమయ్యాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం (Omicron cases in India) 422 ఒమిక్రాన్​ కేసులు బయపడ్డట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది.

మరిన్ని వివరాలు..

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 76,766 యాక్టివ్ కరోనా కేసులు (Corona active cases in India) ఉన్నాయి. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల రేటు 0.22 శాతంగా ఉంది.

కరోనా కారణంగా ఇప్పటి వరకు మొత్తం 4,79,682 మంది మృతి చెందారు. దేశంలో కొవిడ్​ మరణాల రేటు 1.38 శాతంగా ఉంది.

ఇప్పటి వరకు దేశంలో 34,786,802 మందికి కరోనా సోకగా.. అందులో  34,230,354 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది.

వ్యాక్సినేషన్ ఇలా..

నిన్న దేశవ్యాప్తంగా (Covid vaccination in India) 32,90,766 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. దీనితో ఇప్పటి వరకు దేశంలో ఇచ్చిన మొత్తం వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 141.37 కోట్లు దాటింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు ఇలా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 279,836,210 మందికి కరోనా (Corona cases world wide) సోకింది. అందులో 5,413,288 మంది మహమ్మారికి బలయ్యారు. 250,037,954 మంది కొవిడ్ నుంచి కోలుకుని బయటపడ్డారు. 24,384,968 మంది ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్నారు.

Also read: Covid Third Wave : కోవిడ్‌ థర్డ్‌ వేవ్ వస్తే నదులు మళ్లీ మృతదేహాల డంప్‌ యార్డ్‌లు అవుతాయా?

Also read: Rajasthan Omicron cases: చాపకింద నీరులా విస్తరిస్తోన్న ఒమిక్రాన్... రాజస్థాన్​లో కొత్తగా 21 కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More