Home> జాతీయం
Advertisement

Black Fungus: దేశంలో 5 వేల పై చిలుకు బ్లాక్ ఫంగస్ కేసులు

Black Fungus: దేశంలో కరోనా మహమ్మారికి తోడుగా బ్లాక్ ఫంగస్ ఎక్కువగా భయపెడుతోంది. ప్రాణాంతకంగా మారుతుండటంతో ఆందోళన అధికమవుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది.

Black Fungus: దేశంలో 5 వేల పై చిలుకు బ్లాక్ ఫంగస్ కేసులు

Black Fungus: దేశంలో కరోనా మహమ్మారికి తోడుగా బ్లాక్ ఫంగస్ ఎక్కువగా భయపెడుతోంది. ప్రాణాంతకంగా మారుతుండటంతో ఆందోళన అధికమవుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది.

కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటి నుంచి కోలుకోకుండానే ఫంగస్ వ్యాధులు వెంటాడుతున్నాయి. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఎల్లో ఫంగస్ అంటూ వేధిస్తున్నాయి. కరోనా మహమ్మారికి తోడుగా బ్లాక్ ఫంగస్ విజృంభిస్తుండటంతో జనం ఆందోళన చెందుతున్నారు. దేశంలో బ్లాక్ ఫంగస్ తాజా పరిస్థితి ఎలా ఉందనేది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ (Harshavardhan)వివరించారు. మంత్రుల సమావేశంలో ఆయన వివరాల్ని వెల్లడించారు. దేశంలో విస్తరిస్తున్న మ్యూకోర్‌మైకోసిస్(Mucormycosis) వ్యాధిపై చర్చించారు. దేశంలో ఇప్పటి వరకూ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 వేల 424 బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు.

ఇందులో నాన్ కోవిడ్ పేషెంట్లు కూడా ఉన్నారు. మొత్తం 5 వేల 424 కేసుల్లో 4 వేల 556 మంది రోగులకు కోవిడ్ 19 (Covid19) ఉందన్నారు. గుజరాత్‌లో అత్యధికంగా 2 వేల 165, మహారాష్ట్రలో 1188, ఉత్తరప్రదేశ్‌లో 663, మధ్యప్రదేశ్‌లో 519, హర్యానాలో 339, ఆంధ్రప్రదేశ్‌లో 248 బ్లాక్ ఫంగస్ కేసులున్నాయని తెలిపారు. వీరిలో 55 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. గత వారం బ్లాక్ ఫంగస్‌ను(Black Fungus)ఎపిడమిక్ యాక్ట్ కింద నోటిఫై చేసి వివరాల్ని అందించాలని అన్ని రాష్ట్రాల్ని కేంద్రం కోరింది. అయితే బ్లాక్ ఫంగస్ అంటువ్యాధా కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.

Also read: Madras High Court: డిసెంబర్ నాటికి దేశంలో 216 కోట్ల వ్యాక్సిన్ డోసులు సిద్ధం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More