Home> జాతీయం
Advertisement

భారత్‌లో 24 గంటల్లో కరోనాకు 48 మంది బలి

కరోనా వైరస్ కేసులు రోజు వెయ్యికి పైగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 1,396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో 24 గంటల్లో కరోనాకు 48 మంది బలి

కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లోనూ భారీ సంఖ్యలో ప్రాణాలను బలిగొంటోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో తాజాగా 1,396 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 48 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 872కు చేరుకోగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,892గా మారింది. TRS ఆవిర్భావ దినోత్సవం.. కేటీఆర్ రక్తదానం

కరోనాకు చికిత్స తీసుకున్న వారిలో 6,184 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 20,835 యాక్టీవ్ కేసులున్నాయి. వీరు ఆస్పత్రులు, క్వారంటైన్ కేంద్రాలలో చికిత్స పొందుతున్నారు. కేంద్ర వైద్యశాఖ సోమవారం ఉదయం ఈ వివరాలు వెల్లడించింది. ఈ మేరకు తాజాగా హెల్త్ బులెటిన్‌లో కరోనా కేసులు, మరణాల వివరాలు ప్రకటించింది.  ఏపీలో ఎంపీ ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్

కాగా, అత్యధికంగా మహారాష్ట్రలో 8,068 కరోనా కేసులు నమోదుకాగా, 342 మంది మరణించారు. గుజరాత్‌లో 3,301 కేసులతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ 151 మంది ప్రాణాలు బలి తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోనూ అధిక మరణాలు నమోదవుతున్నాయి. 2,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 103 మంది చనిపోయారు. పలు రాష్ట్రాల్లో 2వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు రాగా, దాదాపు 60 మంది వరకు చనిపోయారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Read More