Home> జాతీయం
Advertisement

India post payments bank: పోస్టాఫీసు ఖాతాదారులు గుర్తుంచుకోవల్సిన నిబంధనలు

India post payments bank: మీకు పోస్టాఫీసులో ఖాతాతో పాటు ఇతర రకాల స్కీమ్స్‌లో ఉన్నారా..అయితే కచ్చితంగా కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇండియా పోస్ట్ కొత్త నిబంధనలొచ్చాయి. అందుకే మీరు గుర్తుంచుకోవల్సిన నియమాలేంటంటే..
 

India post payments bank: పోస్టాఫీసు ఖాతాదారులు గుర్తుంచుకోవల్సిన నిబంధనలు

India post payments bank: మీకు పోస్టాఫీసులో ఖాతాతో పాటు ఇతర రకాల స్కీమ్స్‌లో ఉన్నారా..అయితే కచ్చితంగా కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇండియా పోస్ట్ కొత్త నిబంధనలొచ్చాయి. అందుకే మీరు గుర్తుంచుకోవల్సిన నియమాలేంటంటే..

పోస్టాఫీసులు ఇప్పుడు ఇండియా పోస్ట్ బ్యాంకు(India post payment bank)లుగా మారిపోయాయి. పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న చాలా రకాల పధకాల్లో డబ్బు జమ చేసి కచ్చితమైన రాబడిని పొందవచ్చు. కానీ పోస్టాఫీసులో ఖాతా (Post office account) కలిగి ఉన్నవారు కచ్చితంగా కొన్ని నియమాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇండియా పోస్ట్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలున్నాయి( India post new rules). ఇవి ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లో రానున్నాయి. కచ్చితంగా ఈ నిబంధనలు పోస్టాఫీసు ఖాతాదారులపై ప్రభావం చూపించనున్నాయి. పోస్టాఫీసు గ్రామీణ డాక్ సేవ శాఖల్లో వ్యక్తిగత ఖాతా నుంచి నగదు విత్‌డ్రాయల్ పరిధిని 20 వేలకు పెంచింది. వడ్డీ రేటు కూడా సవరించింది. సేవింగ్ ఖాతాపై ఏడాదికి 4 శాతం వడ్డీ లభించనుంది.

గతంలో అయితే పోస్టాఫీసు గ్రామీణ డాక్ సేవ శాఖల్నించి 5 వేల వరకే విత్‌డ్రా పరిధి (Withdrawal limit) ఉండేది. ఇప్పుడా పరిధి 20 వేల రూపాయలకు పెరిగింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ రోజుకు ఒక ఎక్కౌంట్‌లో 50 వేల వరకే డబ్బులు డిపాజిట్ చేయగలడు. అంతకు మించి అవకాశం లేదు. పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ వంటి స్కీమ్‌లలో డబ్బు డిపాజిట్ చేసేందుకు విత్‌డ్రాయల్ ఫామ్ లేదా చెక్ ఉపయోగించవచ్చు. అదే విధంగా సేవింగ్స్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ 5 వందల రూపాయలుండాలి. ఒకవేళ కనీస బ్యాలెన్స్ లేకపోతే వంద రూపాయలు కట్ అవుతాయి.

Also read: JEE Main Results 2021: జేఈఈ మెయిన్ 2021 ఫలితాలు విడుదలకు సర్వం సిద్ధం, రిజల్ట్ ఇలా చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More