Home> జాతీయం
Advertisement

75th Independence Day: దేశ స్వాతంత్య్ర పోరాటంలో స్మరించుకోదగిన సమరయోధులు

75th Independence Day: బ్రిటీషు చెర నుంచి దాస్య శృంఖలాల్ని తెంచుకున్న భారతదేశం వడివడిగా అడుగులేస్తూ..ఇప్పుడు 75వ వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైంది. ఈ క్రమంలో బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటంలో దేశం ఎప్పటికీ గుర్తుంచుకునే సమరయోధుల గురించి తెలుసుకుందాం..

75th Independence Day: దేశ స్వాతంత్య్ర పోరాటంలో స్మరించుకోదగిన సమరయోధులు

75th Independence Day: బ్రిటీషు చెర నుంచి దాస్య శృంఖలాల్ని తెంచుకున్న భారతదేశం వడివడిగా అడుగులేస్తూ..ఇప్పుడు 75వ వజ్రోత్సవ స్వాతంత్య్ర వేడుకలకు సిద్ధమైంది. ఈ క్రమంలో బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాటంలో దేశం ఎప్పటికీ గుర్తుంచుకునే సమరయోధుల గురించి తెలుసుకుందాం..

మహాత్మా గాంధీ నుంచి మొదలుకుని..నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయి పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, భగత్ సింగ్, మంగల్ పాండే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇలా ఎందరో మహనీయులు. అందర్నీ స్మరించుకోకతప్పదు. 

మహాత్మాగాంధీ.. 

fallbacks

జాతిపితగా దేశం యావత్తూ ఇప్పటికీ స్మరించుకుంటున్న మహనీయుడు. బ్రిటీషుకు వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపించిన నేత. అహింసామార్గంలోనే అద్భుతాలు సాధించవచ్చని రుజువు చేసిన మహనీయుడు. ఈ దిశలోనే ప్రపంచానికి సైతం మార్గనిర్దేశనం చేసిన వ్యక్తి. సహాయ నిరాకరణోద్యమంతో పాటు ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా మూమెంట్, దండి మార్చ్, పౌరహక్కులపై అంతర్జాతీయ స్థాయిలో పోరాటం అన్నీ మహాత్ముడి సాధనలే. దురదృష్ఠవశాత్తూ స్వాతంత్య్రం సాధించుకున్న ఏడాదిలోపే..దేశపు దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

సుభాష్ చంద్రబోస్...

fallbacks

ఇక బ్రిటీషుకు వ్యతిరేకంగా జర్మనీతో చేతులు కలిపి గడగడలాడించిన వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్.. ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపకుడు. ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి బ్రిటీషువారిని ముచ్చెమటలు పట్టించారు. స్వామి వివేకానంద ప్రభావం బోస్ పై అధికంగా ఉండేదంటారు. నాకు మీరు రక్తం ఇవ్వండి..నేను మీకు స్వాతంత్య్రం తీసుకొస్తానని చెప్పి యువతలో సైతం స్వాతంత్య్ర కాంక్ష రగిలించారు. 

సర్దార్ వల్లభాయ్ పటేల్...

fallbacks

భారతదేశ ఉక్కుమనిషిగా కీర్తించుకుంటున్న మరో వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. స్వాతంత్య్రానంతరం దేశంలో కీలకమైన పరిణామాలు చేసిన వ్యక్తి. నాడు సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా మూమెంట్‌లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా..దేశంలోని వివిద సంస్థానాల్ని భారతదేశంలో కలపడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి.

భగత్ సింగ్...

fallbacks

ఇక ఇప్పటికీ ఎప్పటికీ అందరికీ గుర్తుండే వ్యక్తి.. స్వాతంత్య్రపోరాటం పేరు చెప్పగానే గుర్తొచ్చే వ్యక్తి భగత్ సింగ్. 23 ఏళ్ల వయస్సుకే దేశం కోసం ప్రాణాలర్పించిన వ్యక్తి. లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం కోసం..నాటి బ్రిటీషు అసెంబ్లీపై బాంబులు విసిరాడు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజల్ని అత్యధికంగా ప్రేరణ కల్గించిన వ్యక్తి. చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించిన హిందూస్తాన్ రిపబ్లిక్ అసోసియేషన్ సభ్యుడు. 

చంద్రశేఖర్ ఆజాద్...

fallbacks

చంద్రశేఖర్ ఆజాద్ పాత్ర నాటి స్వాతంత్య్ర సమరంలో చాలా కీలకం. అప్పుడే హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపనతో బ్రిటీషుకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. మహాత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నాడు. భగత్ సింగ్ వంటి పోరాటయోధులకు స్ఫూర్తి ఇతనే.

మంగల్ పాండే..

fallbacks

నాటి భారత స్వాతంత్య్రోద్యమానికి ఓ రకంగా ఇతనే నాంది పలికాడు. 1857 సిపాయిలు తిరుగుబాటులో కీలకపాత్ర పోషించింది మంగల్ పాండేనే. ఈ తిరుగుబాటునే దేశ స్వాతంత్య్రపు తొలి పోరాటంగా అభివర్ణిస్తారు. సిపాయిల తిరుగుబాటు ఇండియాలో ఈస్ట్ ఇండియా పాలనకు స్వస్తి పలికేలా చేసింది. 

మౌలానా అబుల్ కలాం ఆజాద్..

fallbacks

దేశ స్వాతంత్య్రోద్యమ సమరయోధుల్లో కీలకమైన వ్యక్తి. మక్కాలో జన్మించినా.. ఇండియాకు వలసవచ్చిన వ్యక్తి. వివిధ అంశాల్లో నిష్ణాతుడు. వివిధ దేశాల్లో నాటి విప్లవకారుల్ని కలుసుకున్న వ్యక్తి. విదేశాల్నించి తిరిగొచ్చిన తరువాత నాటి సమరయోధులు అరవింద ఘోష్, శ్యాం సుందర్ చక్రవర్తిలను కలుసుకుని స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా వ్యవహరించాడు. ఖిలాఫత్ ఉద్యమం ద్వారా ముస్లిం కమ్యూనిటీలో బ్రిటీషు వ్యతిరేక భావాలు రేకెత్తించారు. 

డాక్టర్ బీఆర్ అంబేద్కర్...

fallbacks

ఇక అందరి నోట్లో ఎప్పటికీ మర్చిపోని పేరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్. స్వాతంత్య్ర సమయంలో దేశానికి రాజ్యాంగం కావల్సి వచ్చినప్పుడు..వివిధ దేశాల రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి దేశ రాజ్యాంగానికి రూపకల్పన చేసిన వ్యక్తి. దేశంలో సామాజిక మార్పుకు దోహదం చేశాడు. దేశపు తొలి న్యాయశాఖ మంత్రి కూడా. సామాజిక వివక్షతను రూపుమాపేందుకు పోరాడిన వ్యక్తి.

ధీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయ్...

fallbacks

బ్రిటీషు ఆర్మీని గడగడలాడించిన వనిత. 1857 తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాడిన ధీరురాలు. అందుకే ధీరత్వం గురించి చెప్పుకున్నప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయ్ గుర్తుకు రావల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Read More