Home> జాతీయం
Advertisement

Amit Shah warns Pakistan : పాకిస్థాన్‌కు అమిత్ షా గట్టి వార్నింగ్‌, తోకజాడిస్తే స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్

Amit Shah warns Pakistan refers to surgical strikes: ఇంకా మీరు ఇలాగే అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వని పాకిస్థాన్‌ను అమిత్ షా హెచ్చ‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ అని వెల్లడించారు. 

Amit Shah warns Pakistan : పాకిస్థాన్‌కు అమిత్ షా గట్టి వార్నింగ్‌, తోకజాడిస్తే స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్

India now gives befitting reply Amit Shah warns Pakistan refers to surgical strike: పాకిస్థాన్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ (surgical strikes) త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. గోవాలో (Goa) నేష‌న‌ల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివ‌ర్సిటీకి శంకుస్థాప‌న చేయ‌డానికి వెళ్లిన అమిత్ షా కీల‌క‌మైన వ్యాఖ్య‌లు చేశారు. దాడుల‌ను ఏమాత్రం స‌హించ‌మనే విషయం స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ (surgical strikes) నిరూపించాయన్నారు. ఇంకా మీరు ఇలాగే అతిక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డితే మ‌రిన్ని స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ త‌ప్ప‌వని అమిత్ షా (Amit Shah) హెచ్చ‌రించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, (Narendra Modi) మాజీ ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ పారిక‌ర్ తీసుకున్న ముఖ్య‌మైన నిర్ణ‌యం ఈ స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌ అని వెల్లడించారు. 

భారత స‌రిహ‌ద్దుల‌ను ఎవ‌రూ చెరిపే ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌ద‌న్న గ‌ట్టి సందేశం దీని ద్వారా వెళ్లిందని గుర్తు చేశారు. ఒక‌ప్పుడు చ‌ర్చ‌లు జ‌రిగేవి... కానీ ఇప్పుడు దెబ్బ‌కు దెబ్బ కొట్టే సమయం వచ్చిందని అన్నారు. అతిక్రమణలకు పాల్పడినా, కశ్మీర్‌లోని (kashmir) అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినా మరిన్ని మెరుపుదాడులు తప్పవని చెప్పారు.

Also Read : MAA Elections- Prakash Raj letter : సీసీటీవీ ఫుటేజ్‌ ఇవ్వండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ లేఖ

కాగా గతంలో ఉరీ, (uri) పఠాన్‌కోట్‌, (pathankot) గురుదాస్‌పూర్‌లలో పాక్‌ ఉగ్రమూకల దాడులకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు చేపి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

ఇక వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో (Goa Assembly polls) పూర్తిస్థాయి మెజార్టీతో తిరిగి అధికారం సొంతం చేసుకుంటామని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తంచేశారు. బీజేపీ (BJP) సారథ్యంలోని డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం ఉంటే గోవా (Goa) ఇంకా అభివృద్ధి చెందుతున్నారన్నారు. గోవాకు నవంబర్‌ 15 నుంచి ఛార్టర్డ్‌ విమానాలు కూడా అనుమతిస్తున్నట్టు అమిత్ షా (Amit Shah) చెప్పారు.

Also Read : Man tried to set APSRTC bus on fire: ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సుకు నిప్పంటించాడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Read More