Home> జాతీయం
Advertisement

Covid 19 Cases Updates: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే...

India Covid 19 Cases Today: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా మరో 41 మంది మృతి చెందారు.

 Covid 19 Cases Updates: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయంటే...

India Covid 19 Cases Today: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,167 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా మరో 41 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,41,61,899కి చేరింది. కరోనా కారణంగా ఇప్పటివరకూ నమోదైన మరణాల సంఖ్య 5,26,730కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,35,510గా ఉంది.  నిన్నటితో (ఆగస్టు 7) పోలిస్తే యాక్టివ్ కేసుల సంఖ్య 577 మేర పెరిగింది.

గడిచిన 24 గంటల్లో మరో 15,549 కరోనా రివకరీ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో మరో 2,63,419 కరోనా టెస్టులు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకూ దేశంలో కరోనా టెస్టుల సంఖ్య 87,81,88,682కి చేరింది. దేశంలో ఇప్పటివరకూ 206.21 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

గడిచిన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 1,25,624 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పంజాబ్‌లోఅత్యధికంగా 12,155, మహారాష్ట్రలో 12,011, కర్ణాటకలో 11,898, కేరళలో 10656, తమిళనాడులో 9889కరోనా యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ నమోదైన మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్రాల్లో 1,48,139, కేరళలో 70572, కర్ణాటకలో 40,160, తమిళనాడులో 38,033, ఢిల్లీలో 26,330 మరణాలు నమోదయ్యాయి.

Also Read: KomatiReddy Rajgopal Reddy Live Updates: యుద్ధం మొదలైందన్న రాజగోపాల్ రెడ్డి.. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజానామా

Also Read: JEE Main Result 2022: జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలు విడుదల... విద్యార్థులు రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Read More