Home> జాతీయం
Advertisement

Covid-19: దేశంలో నానాటికి పెరుగుతున్న కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ కేసులు (Coronavirus), మరణాల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. గత ఆరు రోజుల నుంచి ప్రతీరోజు దేశవ్యాప్తంగా 50వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 

Covid-19: దేశంలో నానాటికి పెరుగుతున్న కరోనా కేసులు

India Corona cases: ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు, మరణాల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. గత ఆరు రోజుల నుంచి ప్రతీరోజు దేశవ్యాప్తంగా 50వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే.. గత 24 గంటల్లో 52,050 కొత్త కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా 803 మంది మరణించారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health Ministry ) మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,55,745కి పెరిగింది. అంతేకాకుండా మృతుల సంఖ్య 38,938కి చేరింది.  Also read: Covid-19: ఒక్కరోజులో 6.6లక్షలకు పైగా టెస్టులు

దేశంలో ప్రస్తుతం 5,86,298 కరోనావైరస్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 12,30,509 మంది కోలుకున్నారు. ఇదిలాఉంటే.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2కోట్లకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ ( ICMR ) వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 66.30 శాతంగా ఉండగా..  మరణాల రేటు 2.1 శాతంగా ఉంది. Also read: Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?

Read More