Home> జాతీయం
Advertisement

Independence Day Wishes 2022: ప్రియమైన వారికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. సింపుల్ స్టెప్స్!

How to send Independence Day WhatsApp stickers. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?. 
 

Independence Day Wishes 2022: ప్రియమైన వారికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు ఇలా చెప్పండి.. సింపుల్ స్టెప్స్!

How to send Independence Day WhatsApp stickers and GIFs: సుదీర్ఘ పోరాటం, ఎన్నో బలిదానాల తర్వాత 1947 ఆగస్టు 15న బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి భారతీయులు విముక్తి పొందారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 15న మనం స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) జరుపుకుంటూ వస్తున్నాం. సోమవారం నాడు దేశం మొత్తం 75వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day 2022) వేడుకలను జరుపుకుంటుంది. ఈ పండుగను గుర్తుండిపోయేలా చేయడానికి ప్రభుత్వం 'హర్ ఘర్ తిరంగ అభియాన్'తో ముందుకు వచ్చింది. 

భారత దేశ ప్రజలు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రొఫైల్ ఫోటోలను జాతీయ జెండాగా మార్చుకోవాలని ప్రధాని మోదీ కోరిన విషయం తెలిసిందే. అంతేకాదు ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకు తమ ఇళ్లపై జెండా ఎగురవేయాలని కూడా ప్రధాని కోరారు. నేడు స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?. WhatsApp, Facebook, Instagram, Telegram మరియు మరిన్ని ఇతర సోషల్ మీడియా యాప్‌లలో సందేశాలు పంపాలనుకునే వారు ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అయితే సరిపోద్ది. 

WhatsApp స్టిక్కర్లను ఎలా పంపాలంటే:
1. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ని తెరిచి సెర్చ్ బార్‌లో 'ఇండిపెండెన్స్ డే' అని సెర్చ్ చేయండి.
2. మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకుని డౌన్లోడ్ చేసుకోవాలి.
3. ఇది పూర్తయిన వెంటనే WhatsApp యొక్క My Stickers ట్యాబ్‌లో ప్యాక్‌లోని అన్ని స్టిక్కర్‌లు మీకు కనిపిస్తాయి.
4. స్టిక్కర్ ప్యాక్ నుంచి స్టిక్కర్‌ని ఎంచుకుని '+' గుర్తుపై ప్రెస్ చేయాలి. ఆపై 'Add to WhatsApp' బటన్‌ను క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు స్వాతంత్య్ర దినోత్సవ స్టిక్కర్లను ఎంచుకుని మీ స్నేహితులకు పంపండి.

WhatsApp GIFలను ఎలా పంపాలంటే:
1: WhatsAppకి వెళ్లి మీరు GIFని పంపాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ చాట్‌పై క్లిక్ చేయండి.
2: మెసేజింగ్ బాక్స్‌లో అందుబాటులో ఉన్న స్మైలీ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
3: GIF ఎంపికపై క్లిక్ చేయండి.
4: ఇప్పుడు సెర్చ్ బటన్‌పై క్లిక్ చేసి, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని టైప్ చేయండి.
5: ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై పలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే GIF వస్తాయి.
6: మీకు నచ్చిన GIFపై క్లిక్ చేసి సెండ్ బటన్‌పై నొక్కండి.

Also Read: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. హైదరాబాద్‌లో నేటి పసిడి రేట్లు ఇలా ఉన్నాయి!

Also Read: Horoscope Today 15 August 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రాశుల ప్రేమికులకు కలిసొచ్చే రోజు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More