Home> జాతీయం
Advertisement

IT Refund Delay: ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా, ఇదే కారణం కావచ్చు. ఏం చేయాలంటే

IT Refund Delay: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడువు ముగిసింది. చాలామందికి రిఫండ్ కూడా వచ్చేసింది. కానీ కొంతమందికి రిఫండ్ ఇంకా రాలేదు. మీక్కూడా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ రిఫండ్ అందకపోయుంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం. పూర్తి వివరాలు మీ కోసం.

IT Refund Delay: ఐటీ రిఫండ్ ఇంకా రాలేదా, ఇదే కారణం కావచ్చు. ఏం చేయాలంటే

IT Refund Delay: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి చాలా రోజులు గడుస్తున్నా రిఫండ్ ఇంకా అందకపోతే దానికి కొన్ని కారణాలు ఉండవచ్చు. ముందు ఇ ఫైలింగ్ పోర్టల్ ఓపెన్ చేసి స్టేటస్ చెక్ చేస్తే ఎందుకు రాలేదో తెలుస్తుంది. ఆధార్ కార్డు పాన్ కార్డు లింక్ అవకపోయినా రిఫండ్ నిలిచిపోతుంది. అదే జరిగితే ఏం చేయాలి..

ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ కాకపోతే ఐటీఆర్ రిఫండ్ నిలిచిపోయే అవకాశముంది. చాలా కేసుల్లో ఈ కారణంతోనే రిఫండ్ ఆగిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్‌కంటాక్స్ శాఖ రిఫండ్ ప్రక్రియను వెరిఫికేషన్‌లో ఉంచుతుంది. ఏదైనా సాంకేతిక కారణాలతో రిఫండ్ ఆలస్యమైతే స్టేటస్ చెక్ చేసినప్పుడు అక్కడ ఆ కారణం కన్పిస్తుంది. ఆధార్ కార్డు-పాన్ కార్డు అనుసంధానం కాకపోవడం, బ్యాంక్ ఎక్కౌంట్‌తో ఆధార్ లింక్ కాకపోవడం ఇలా చాలా ఇతర కారణాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ జరగకపోయుంటే ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. 

ప్రస్తుతం ఇన్‌కంటాక్స్ శాఖకు రిఫండ్ విషయంలో చాలా ఫిర్యాదుల వస్తుంటాయి. చాలా కేసులు పెండింగులో ఉన్నందున కాస్త ఆలస్యం కావచ్చు. సోషల్ మీడియాలో చాలామంది ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. రిఫండ్ ఆలస్యమవడానికి ప్రధాన కారణం మాత్రం ఆధార్ కార్డు-పాన్ కార్డు లింక్ కాకపోవడమే. అందుకే ముందు ఇది చెక్ చేసుకోవాలి. జరగకపోయుంటే ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పూర్తి చేసుకోవాలి.  పాన్ కార్డు-ఆధార్ కార్డు లింకింగ్ గడువును చాలాసార్లు పొడిగించడమైనది. ఇప్పుడు 1000 రూపాయల జరిమానాతో పాన్ కార్డు - ఆధార్ కార్డు లింక్ చేయవచ్చు. 2017 జూలై 1 కంటే ముందు జారీ అయిన పాన్ కార్డులు అన్నీ ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉంటుంది. 

రిఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి How to check IT Refund Status

ముందుగా ఇన్‌కంటాక్స్ శాఖ అధికారిక పోర్టల్ www.incometax.gov.in లాగిన్ అవాలి. ఆ తరువాత మీ పాన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మై ఎక్కౌంట్ క్లిక్ చేసి అందులోంచి రిఫండ్ స్టేటస్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎంచుకోవాలి. తరువాత రిసీప్ట్ నెంబర్ క్లిక్ చేస్తే ఐటీ రిటర్న్స్ సమాచారం కన్పిస్తుంది. 

మీ మెయిల్ కూడా చెక్ చేసుకోవాలి. ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి రిఫండ్ సంబంధించి ఏదైనా సమాచారం వచ్చి ఉండవచ్చు. ఒకవేళ రిఫండ్ స్టేటస్‌లో రిఫండ్ క్లెయిమ్ రిజెక్ట్  అని ఉంటే ట్యాక్స్ పేయర్ రిఫండ్ రీ ఇష్యూ చేయవచ్చు. క్లెయిమ్ పెండింగులో ఉంటే మాత్రం ఇ ఫైలింగ్ పోర్టల్ లేదా సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఇంకా ఆలస్యం అవుతుంటే హెల్ప్‌లైన్ నెంబర్ 1800 103 4455 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.

Also read: Weight Loss Drinks: రోజూ రాత్రి వేళ ఈ డ్రింక్స్ తాగితే 4 వారాల్లో అధిక బరువుకు చెక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More