Home> జాతీయం
Advertisement

IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలు

IT Return Tips: ఉద్యోగస్థులంతా ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయం ఇది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా మీకు రావల్సిన రిఫండ్ ఆగిపోవచ్చు. చట్టపరంగా చర్యలు కూడా ఉండవచ్చు. అందుకే ఈ పొరపాట్లు జరగకుండా చూసుకోండి.

IT Return Tips: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఈ పొరపాట్లు చేయవద్దు లేకపోతే చట్టపరమైన చర్యలు

IT Return Tips: ఇన్‌కంటాక్స్ పరిధిలో ఉండే ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగి తప్పకుండా చేయాల్సిన పని ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం. ఫామ్ 16 చేతికి అందగానే ఆ ప్రక్రియ ప్రారంభమౌతుంటుంది. రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు అన్నీ సక్రమంగా లేకుంటే మీ రిఫండ్ ఆగిపోవడమే కాకుండా మీపై చట్టపరంగా చర్యలు తప్పవు. అందుకే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు చాలాఅప్రమత్తంగా ఉండాలి. 

2023-24 సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు గడువు తేదీ జూలై 31. మీరు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, ఫామ్స్, ఇతర సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలి. అన్నింటికంటే ముందుగా మీ ఆధార్ కార్డు..పాన్‌కార్డుతో అనుసంధానమైందో లేదో చెక్ చేసుకోండి. అదే సమయంలో రిఫండ్ చేరే బ్యాంక్ ఎక్కౌంట్ తో కూడా వెరిఫై చేసుకోవాలి. ఈ రెండింట్లో ఏది లేకున్నా రిఫండ్ ఆగిపోతుంది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏ ఫామ్ ఫిల్ చేయాలో తెలుసుకోవాలి. పొరపాటున తప్పుడు ఫామ్ సమర్పిస్తే మరోసారి రివైజ్ చేసుకోవచ్చు. మీరు వేతన జీవి అయితే మాత్రం ఐటీఆర్-1 ఫిల్ చేయాలి.

మీ ఆదాయం ఒక ఆర్ధిక సంవత్సరానికి 50 లక్షల కంటే తక్కువ ఉంటే ఐటీఆర్-1 ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆదాయం అనేది మీ జీతం, కుటుంబ పెన్షన్, వ్యవసాయ ఆదాయం రూపంలో ఉండవచ్చు. అయితే ఈ ఫామ్ కేవలం భారతీయ పౌరులకే వర్తిస్తుంది. విదేశీయులకు ఐటీఆర్ 1 వర్తించదు. ఏడాది ఆదాయం 50 లక్షల రూపాయలు దాటినవారికి కూడా ఈ ఫామ్ వర్తించదు. లాటరీ, గుర్రం పందేలు, లీగల్ బెట్టింగ్, షేర్ మార్కెట్ లాభాలు, ఈక్విటీ షేర్లలో పెట్టుబడులపై వచ్చే ఆదాయం ఉన్నప్పుడు కూడా ఐటీఆర్ 1 వర్తించదు.

వార్షిక సమాచారం మొత్తం సేకరించాలి. అన్నింటికంటే ముఖ్యంగా మీరు ఉద్యోగం చేసే సంస్థ జారీ చేసే ఫామ్ 16 తప్పకుండా ఉండాలి. రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్ అవసరం లేదు. కానీ ఆ డాక్యుమెంట్లు వెంట ఉంచుకోవడం మంచిది. ఎందుకంటే ఒక్కోసారి తనిఖీ ఉండే అవకాశం ఉంటుంది.  ఫామ్ 26 ఏఎస్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇందులో ఏమైనా వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవాలి. ఐటీఆర్ ఫైలింగ్‌లో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి. లేకపోతే రిఫండ్ నిలిచిపోయే ప్రమాదముంది.

Also read: Bengaluru Airport: ఆ విమానాశ్రయంలో అడుగుపెడితే జేబు గుల్ల, 7 నిమిషాలకు 150 రూపాయలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More