Home> జాతీయం
Advertisement

Income Tax raids on Rashmika Mandanna's residence: రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడుల్లో కొత్త కోణం!

రష్మిక మందన్నకు తాజాగా ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాట్‌పేట్‌లోని రష్మిక మందన్న నివాసంపై ఐటి అధికారులు దాడులు చేపట్టారు. కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ నాట సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక మందన్న.. కొద్దికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

Income Tax raids on Rashmika Mandanna's residence: రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడుల్లో కొత్త కోణం!

రష్మిక మందన్న.. టాలీవుడ్ వర్గాల్లో బాగా వినిపిస్తున్న హీరోయిన్స్ పేర్లలో రష్మిక మందన్న కూడా ఒకటి. గీత గోవిందం సినిమాతో తెలుగు సినీ తెరకు పరిచయమైన ఈ కన్నడ బ్యూటీకి తెలుగు నాట ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. అందుకే గీత గోవిందం సినిమా మొదలు.. ఇటీవలే వచ్చిన సరిలేరు నీకెవ్వరు వరకు టాలీవుడ్‌లో కొన్ని మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో శాండల్‌వుడ్ హీరోయిన్ రష్మిక మందన్న విజయం సాధించింది. వరుసగా సక్సెస్‌ ఎంజాయ్ చేస్తూపోతున్న రష్మిక మందన్నకు తాజాగా ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాట్‌పేట్‌లోని రష్మిక మందన్న నివాసంపై ఐటి అధికారులు దాడులు చేపట్టారు. కిరిక్ పార్టీ అనే సినిమాతో కన్నడ నాట సినీరంగ ప్రవేశం చేసిన రష్మిక మందన్న.. కొద్దికాలంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇప్పటివరకు చేసింది తక్కువ సినిమాలే అయినా... ఎక్కువ ప్రజాధరణ పొందింది. రష్మిక మందన్నను వరుస అవకాశాలు కూడా వరించాయి. దీంతో ఐటి అధికారుల కన్ను ఆమె ఆదాయంపై పడింది. 

రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడులు అందుకేనా ?..
రష్మిక మందన్న నివాసంపై ఐటి దాడుల్లో కొత్త కోణం వెలుగుచూస్తోంది. కర్ణాటకలో ఇద్దరు కాంగ్రెస్ నేతలు డికె శివకుమార్, కేజే జార్జ్‌లకు రష్మిక మందన్న కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని తెలుస్తోంది. మూడు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ఇద్దరు నేతల ఆదాయం లెక్కలపై ఓ కన్నేసిన ఐటి, ఈడి బృందాలు.. తాజాగా రష్మిక మందన్న నివాసంపైనా దాడి చేస్తే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉందనే అంచనాతోనే ఈ సోదాలు జరుపుతున్నట్టు కన్నడ నాట ఓ టాక్ బలంగా వినిపిస్తోంది. రష్మిక మందన్న ఇంట్లో ఐటి సోదాల వెనుక కాంగ్రెస్ నేతలు డికే శివకుమార్, కేజే జార్జ్‌లతో ఆమె కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలే ఓ కారణమంటూ అక్కడి మీడియా కథనాలు సైతం పేర్కొంటున్నాయి.  

ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో డికే శివకుమార్ జైలుకెళ్లి రాగా.. విదేశాల్లో నల్ల ధనం దాచుకున్నారనే అనుమానాలు వ్యక్తంచేస్తూ ఫెమా చట్టం కింద కేజే జార్జుకు సైతం నిన్ననే (బుధవారం జనవరి 15) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీచేసింది. కేజే జార్జుకు ఈడి సమన్లు జారీ అయిన మరుసటి రోజే ఈ ఐటి సోదాలు జరగడం కూడా ఈ ప్రచారానికి ఓ కారణమైంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More