Home> జాతీయం
Advertisement

IT Raids: ఏకకాలంలో దేశంలో 55 ప్రాంతాల్లో ఐటీ దాడులు, 94 కోట్ల నగదు స్వాధీనం

IT Raids: ఇన్‌కంటాక్స్ శాఖ దాడులు జరుగుతున్నాయి. కర్ణాటక సహా 4 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఆదాయపు పన్నుశాఖ నిర్వహించిన దాడుల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 

IT Raids: ఏకకాలంలో దేశంలో 55 ప్రాంతాల్లో ఐటీ దాడులు, 94 కోట్ల నగదు స్వాధీనం

IT Raids: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ సూచనల మేరకు ఇన్‌కంటాక్స్ శాఖ దాడులు నిర్వహించింది. ఒకేసారి దేశంలోని  ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్ల ఇళ్లపై ఈ సోదాలు జరిగాయి. ఏకంగా 55 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. భారీగా నగదు, నగలు స్వాధీనం చేసుకున్నారు.

దేశంలో కర్ణాటక సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఇన్‌కంటాక్స్ శాఖ సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్ నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఒకేసారి 55 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించింది. ఈ దాడులు ప్రభుత్వ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు లక్ష్యంగా సాగినట్టు తెలుస్తోంది. లెక్క చూపించని 94 కోట్ల నగదు, 8 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలు స్వాధీనం చేసుకున్నామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ వెల్లడించింది. మరో ప్రైవేట్ ఉద్యోగి ఆవరణలో 30 లగ్జరీ రిస్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో నేరారోపణకు అవసరమైన డాక్యుమెంట్లు, హార్డ్ కాపీలు, డిజిటల్ డేటా ఆధారాలు లభ్యమయ్యాయి. బోగస్ కొనుగోలు రసీదుల ద్వారా భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఐటీ శాఖ గుర్తించింది. 

కర్ణాటక, తెలంగాణ, ఏపీ, ఢిల్లీలోని కొన్ని నగరాల్లో ఉన్న బడా రియల్ ఎస్టేట్ సంస్థలు, కాంట్రాక్టర్లపైనే ఈ దాడులు జరిగాయి. అయితే దాడుల్లో ఐటీ శాఖ ఊహించినంతగా అక్రమ నగదు పట్టుబడకపోవడం విశేషం. దాడుల గురించి ముందస్తు సమాచారం ఏమైనా ఆ సంస్థలకు అందించే జాగ్రత్త పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఎందుకంటే ఒకేసారి అంత పెద్దఎత్తున ఐటీ సోదాలు జరిపితే 94 కోట్లే పట్టబడటం చర్చనీయాంశమౌతోంది.

మరోవైపు పట్టుబడిన ఈ డబ్బుపై కర్ణాటక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోదాల్లో లభించిన నగదు కాంగ్రెస్ పార్టీకి చెందిందంటూ బీజేపీ ఆరోపిస్తోంది. అటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు.

Also read: Uttarakhand earthquake: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం.. ఆందోళనలో జనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More