Home> జాతీయం
Advertisement

Rains in 2020: రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్

కొన్ని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2020 ఏడాదిలో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు 100% సమృద్ధిగా కురుస్తాయని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు.

Rains in 2020: రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్

న్యూ ఢిల్లీ: కొన్ని కోట్లాది మంది రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. 2020 ఏడాదిలో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు వాతావారణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ వర్షాకాలంలో వర్షాలు 100% సమృద్ధిగా కురుస్తాయని.. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే అది ఓ 5 శాతం ఎక్కువ కానీ లేదా తక్కువ కానీ ఉంటుండొచ్చని కేంద్ర భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ తెలిపారు. జూన్-సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఏయే తేదీల్లో వర్షాలు కురవనున్నాయనే అంచనాలను సైతం వాతావరణ శాఖ విడుదల చేసింది. 

Also read : లాక్‌డౌన్ మార్గదర్శకాల పూర్తి జాబితా.. మందుబాబులకు మళ్లీ నిరాశే

భూగోళ శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 1న కేరళలో, జూన్ 4న చెన్నైలోకి, జూన్ 7న పంజిమ్‌లోకి, జూన్ 8న హైదరాబాద్‌లోకి, జూన్ 10న పూణెలోకి, జూన్ 11న ముంబైలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. చివరిగా జూన్ 27న రుతుపవనాలు ఢిల్లీని తాకనున్నాయని మాధవన్ రాజీవన్ తెలిపారు. 

Also read: IPL రద్దు దిశగా కీలక అడుగు!

భారత్‌లో వ్యవసాయంపైనే ఆధారపడిన రైతులకు జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కురిసే వర్షాలు ఎంతో ముఖ్యమైనవి. వరి, గోధుమలు, చెరుకు పంటలతో పాటు ఇతర నూనె గింజల పంటల సాగుకు వర్షా కాలం వర్షాలు ఎంతో కీలకం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More