Home> జాతీయం
Advertisement

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్​పూర్​లో కరోనా కలకలం... 60 మందికి కొవిడ్ పాజిటివ్!

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో 60 మందికి కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. 
 

IIT Kharagpur: ఐఐటీ ఖరగ్​పూర్​లో కరోనా కలకలం... 60 మందికి కొవిడ్ పాజిటివ్!

IIT Kharagpur reports 60 Covid-19 cases: ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో కరోనా (Covid-19 cases in IIT Kharagpur) కలకలం రేపింది. సుమారు 60 మందికి కొవిడ్ (Covid-19) పాజిటివ్ గా తేలింది. వీరిలో 40 మంది విద్యార్థులున్నట్లు అధికారులు వెల్లడించారు.  మిగిలిన ఇరవై మందిలో క్యాంపస్​లో నివసించే ఇతరులు ఉన్నట్లు పేర్కొన్నారు. వైరస్​ సోకిన వారిలో ఎక్కువ మందికి స్వల్పంగా లక్షణాలు ఉన్నట్లు రిజిస్ట్రార్​ తమల్​ నాథ్​  (Tamal Nath)  తెలిపారు. లక్షణాలు కనిపించని వారిని హోం ఐసోలేషన్​లోనూ (home isolation)...మిగిలిన వారిని హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో ఉంచినట్లు ఆయన చెప్పారు. క్యాంపస్​లోనే ఆసుపత్రి ఉండడం కారణంగా పరిస్థితి అదుపులోనే ఉందని​ తమల్​ నాథ్​ చెప్పారు.

"ఐఐటీ ఖరగ్‌పూర్​కు చెందిన ప్రతీ ఒక్కరు జ్వరం లాంటి కొవిడ్​ లక్షణాలు కనిపిస్తే కచ్చితంగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. ఇప్పటికి 60 మందికి పాజిటివ్ గా తేలింది. ఇంకా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు. అదే జరిగితే ఆంక్షలను విధించక తప్పదు. అందుకే మేము చెప్పిన సూచనలను పాటించాలని కోరుతున్నాం." అని రిజిస్ట్రార్​ తమల్​ నాథ్​ అన్నారు. 

Also Read: Bihar: మెడికల్‌ కళాశాలలో కరోనా కలకలం.. 87 మంది వైద్యులకు పాజిటివ్!

డిసెంబర్​ 18న ఐఐటీలో స్నాతకోత్సవం (convocation) జరిగింది. విద్యార్థులను దశలవారీగా క్యాంపస్​కు తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. తాజాగా  వైరస్​ వ్యాప్తి దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్​ తమల్ నాథ్​ పేర్కొన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More