Home> జాతీయం
Advertisement

హైదరాబాద్ - అమరావతి మధ్య హైస్పీడ్ రైలు !

హైదరాబాద్ - అమరావతి మధ్య హైస్పీడ్ రైలు !

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ గుడ్‌న్యూస్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య హైస్పీడ్ రైలుకు సంబంధించిన ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై ఉపరితల రవాణాశాఖతో రైల్వే శాఖ చర్చించి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయి. రెండు ప్రభుత్వాలు కన్సార్టియంగా ఏర్పడితే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 

తాజా ప్రతిపాదన ప్రకారం తొలుత హైదరాబాద్-విజయవాడల మధ్యనున్న 270 కిలోమీటర్ల దూరాన్ని ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వే మాదిరిగా 8 లేన్లుగా విస్తరిస్తారు. అదే సమయంలో హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా చేపట్టనున్నట్టు సమాచారం. రెండు రాజధానుల మధ్య రైలు, రోడ్డు అనుసంధానాన్ని పెంచి, అభివృద్ధి కారిడార్‌గా మార్చడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తియితే రెండే రెండు గంటల్లోపు గమ్యానికి చేరుకోవచ్చు.

Read More