Home> జాతీయం
Advertisement

లాక్ డౌన్ తర్వాత కూడా ఆ వ్యాపారాలకు అనుమతి లేదా ?

మే3న ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. ఆ తర్వాత కూడా హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌పై అక్టోబర్ 15 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఓ సర్కులర్ కూడా ఆ వార్తతో పాటే వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ పుకార్లపై స్పందించిన పర్యాటక శాఖ.. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ సర్కులర్ తాము విడుదల చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. 

లాక్ డౌన్ తర్వాత కూడా ఆ వ్యాపారాలకు అనుమతి లేదా ?

న్యూఢిల్లీ: మే3న ఒకవేళ లాక్‌డౌన్‌ ఎత్తేసినా.. ఆ తర్వాత కూడా హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌పై అక్టోబర్ 15 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. స్వయంగా కేంద్ర పర్యాటక శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసినట్లుగా ఉన్న ఓ సర్కులర్ కూడా ఆ వార్తతో పాటే వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ పుకార్లపై స్పందించిన పర్యాటక శాఖ.. ఆ వార్తలో నిజం లేదని కొట్టిపారేసింది. ఆ సర్కులర్ తాము విడుదల చేయలేదని కేంద్ర పర్యాటక శాఖ వెల్లడించింది. 

fallbacks

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Also read: హోమ్ క్వారంటైన్‌పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

ఈ మేరకు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో (PIB) నిజ నిర్ధారణ జరిపి ట్విటర్ ద్వారా అసలు విషయాన్ని నెటిజెన్స్‌కి తెలియజేసింది. అక్టోబర్ 15 వరకు హోటల్స్, రెస్టారెంట్స్ మూసేస్తున్నట్టు కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిందనే వార్తల్లో నిజం లేదని పీఐబి స్పష్టంచేసింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Read More