Home> జాతీయం
Advertisement

Rakul Preet Singh: ఆ వార్తలను నిలువరించాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది.

Rakul Preet Singh: ఆ వార్తలను నిలువరించాలంటూ.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్

Rakul Preet Singh move delhi high court: న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) ఆత్మహత్య కేసు విచారణలో ఇటీవల కాలంలో పలు కీలక విసయాలు బయటపడిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహరంలో ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె తమ్ముడు పలువురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్ట్ చేసింది. డ్రగ్స్ కేసు ఎన్‌సీబీ విచారణలో రియా చక్రవర్తి పలవురు ప్రముఖుల పేర్లను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ భామలు రకుల్ ప్రిత్ సింగ్‌ (Rakul Preet Singh) తోపాటు సారా అలీఖాన్ (Sara Ali Khan) పలువురు ప్రముఖులు ఉన్నట్లు మీడియాతో పాటు సోషల్ మీడియాలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ క్రమంలో మీడియాలో తనపై వస్తున్న వార్తలను నిలువరించాలంటూ.. సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. Also read: Rakul preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ కఠిన నిర్ణయం తీసుకుందా ?

డ్రగ్స్ కేసులో తనపై మీడియాలో వస్తున్న కథనాలను నిలిపివేయాలని, వార్తలు ప్రసారం కాకుండా సమాచార శాఖకు ఆదేశాలివ్వాలని కోరుతూ గురువారం రకుల్ ప్రీత్‌సింగ్ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ నవీన్‌ చావ్లా ధర్మాసనం స్వీకరించి.. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియాలో ప్రసారాలపై ఇటీవలనే సుప్రీంకోర్టు స్పందించిందని.. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు సమాధానం ఇవ్వాలని సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసింది. మీయియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని హైకోర్టు సూచించింది. అయితే.. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయం వ్యక్తంచేసింది.  Also read: Drugs case: డ్రగ్స్ కేసులో.. హీరోయిన్లు సారా, రకుల్?

Read More