Home> జాతీయం
Advertisement

Jammu kashmir: భద్రతదళాల విజయం, హిజ్బూల్ ఛీప్ సైఫుల్లా హతం

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత  కొనసాగుతోంది. భద్రతా బలగాలకు భారీ సాఫల్యం లభించింది. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బూల్ ముజాహిదీన్ ఛీప్ సైఫుల్లా హతమయ్యాడు.

Jammu kashmir: భద్రతదళాల విజయం, హిజ్బూల్ ఛీప్ సైఫుల్లా హతం

జమ్ముకశ్మీర్ ( Jammu kashmir ) లో ఉగ్రవాదుల ( Terrorists ) ఏరివేత  కొనసాగుతోంది. భద్రతా బలగాలకు భారీ సాఫల్యం లభించింది. ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బూల్ ముజాహిదీన్ ఛీప్ సైఫుల్లా హతమయ్యాడు.

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాద కదలికలపై ఇటీవలి కాలంలో భద్రతాదళాల నిఘా పటిష్టమైంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లో ఆదివారం  భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ( Encounter ) జరిగాయి. ఈ కాల్పుల్లో హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సైఫుల్లా ( Hizbul mujahideen chief saifullah mir shot dead ) హతమయ్యాడు. శ్రీనగర్‌ సరిహద్దులో ( Srinagar border ) జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది పట్టుబడ్డాడు.  ప్రస్తుతం భద్రతాబలగాల అదుపులో ఉన్నాడు. శ్రీనగర్‌లోని రంగ్రేత్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే సమాచారం మేరకు.. పోలీసులు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఉగ్రవాదులు తలదాచుకున్నట్టుగా సందేహించిన ప్రాంతానికి చేరగానే మిలిటెంట్లు వారిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా కాల్పులు జరపగా హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్‌ కమాండర్‌ సైఫుల్లా అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు.

ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలంలో ఉగ్రవాదుల నుంచి ఏకే-47తో పాటు కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా ( Pulwama ) జిల్లాలోని మలంగ్‌పోరాకు చెందిన సైఫుల్లా  2014 అక్టోబర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్‌లో చేరాడని తెలుస్తోంది. గతంలో అంటే మే 6న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన రియాజ్ నాయకూ ( Riyaz naikoo ) ..సైఫుల్లాను నియమించి ఘాజీ హైదర్ అని పేరు పెట్టినట్లు సమచారం. సైఫుల్లాను మట్టుబెట్టడం తమకు గ్రేట్ ఎఛీవ్‌మెంట్‌ అని భద్రతా బలగాలకు చెందిన ఓ అధికారి తెలిపారు.  Also read: Yogi Adityanath: లవ్ జిహాద్‌ను సహించం.. వినకపోతే అంతిమయాత్రే 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More