Home> జాతీయం
Advertisement

Himachal Pradesh Snowfall: హిమాచల్‌లో భారీ హిమపాతం, రోడ్లు ముసివేత, అంతా అస్తవ్యస్థం

Himachal Pradesh Snowfall: మార్చ్ నెల వచ్చినా భారీ హిమపాతం కురుస్తోంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని అస్తవ్యస్థం చేస్తోంది. రోడ్లే కాదు నదీ ప్రవాహం కూడా మంచుతో నిండిపోయింది. రవాణా వ్యవస్థ స్థంబించడంతో పరిస్థితి ఘోరంగా మారుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Himachal Pradesh Snowfall: హిమాచల్‌లో భారీ హిమపాతం, రోడ్లు ముసివేత, అంతా అస్తవ్యస్థం

Himachal Pradesh Snowfall: హిమాచల్ ప్రదేశ్‌లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. నాలుగైదురోజులుగా భారీగా కురుస్తున్న మంచు కారణంగా రోడ్లన్నీ తెల్లటి మంచు దుప్పటి పర్చుకున్నాయి. రాష్ట్రంలో  రోడ్లన్నీ మంచుతో మూసుకుపోవడంతో రవాణా వ్యవస్థ స్థంబించిపోయింది. రాష్ట్రంలోని ప్రజలు నిత్యావసర వస్వులు కూడా లభించక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. 

వేసవి ప్రారంభమైనా ఉత్తరాదిన మంచు ప్రతాపం వీడటం లేదు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని గత నాలుగైదు రోజులుగా భారీ హిమపాతం విధ్వంసం సృష్టిస్తోంది. ముఖ్యంగా లాహోల్, స్పితి, కిన్నౌర్, చంబా జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది.

fallbacks

భారీ హిమపాతం కారణంగా చీనాబ్ నదీ ప్రవాహానికి సైతం అంతరాయం ఏర్పడింది. దాంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. భారీ మంచు, వర్షాల కారణంగా హిమపాతంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్రంలో 650 వరకూ రోడ్లు మూసుకుపోయాయి.

fallbacks

లాహౌల్ జిల్లా తాడి వంతెన వద్ద మంచు చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. కిన్నౌర్ జిల్లాలోని సంగ్లాలో కర్చమ్ హెలీప్యాడ్ వద్ద భారీగా హిమపాతం కురిసింది. ఎక్కడికక్కడ భారీగా మంచు కురుస్తుండటంతో పాటు కొండ చరియలు విరిగిపడటంతో స్టేట్ ఎమర్జన్సీ ఆపరేషన్ 650 రోడ్లను మూసివేసింది. భారీ హిమపాతం కారణంగా విద్యుత్ సరఫరా, కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 

fallbacks

Also read: 7th Pay Commisson: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, డీఏ పెంపు మార్చ్ నుంచే, భారీగా జీతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More