Home> జాతీయం
Advertisement

Anil Vij: కోవ్యాక్సిన్ డోసు తీసుకున్న హర్యానా ఆరోగ్య మంత్రి

హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ ( ‘Covaxin’ 3rd Phase trials ) దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ ట్రయల్ డోసును హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) శుక్రవారం తీసుకున్నారు.

Anil Vij: కోవ్యాక్సిన్ డోసు తీసుకున్న హర్యానా ఆరోగ్య మంత్రి

Minister Anil Vij being administered a trial dose of Covaxin: న్యూఢిల్లీ: హైదరాబాద్ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ (Bharat Biotech) అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ తుది దశ క్లినికల్ ట్రయల్స్‌ ( ‘Covaxin’ 3rd Phase trials ) దేశ్యావ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కోవ్యాక్సిన్ ట్రయల్ డోసును హర్యానా హోంమంత్రి, ఆరోగ్యమంత్రి అనిల్ విజ్ ( Haryana Health Minister Anil Vij ) శుక్రవారం తీసుకున్నారు. అంబాలాలోని కోవిడ్ ఆసుపత్రిలో ఆయ‌న ఈ రోజు కోవిడ్ టీకాను వేయించుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రారంభమయ్యే కోవ్యాక్సిన్ ట్రయల్స్‌లో మొదటి వాలంటీర్‌గా ఆయన టీకాను తీసుకున్నారు. ఈ కోవ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలకు.. తొలి వాలంటీర్‌గా తాను స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లు మంత్రి అనిల్ విజ్ బుధవారం ట్విట్టర్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. Also read: Covaxin: కోవ్యాక్సిన్ వాలంటీర్‌గా హర్యానా మంత్రి అనిల్ విజ్

అయితే.. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR‌) సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్‌ (Covaxin)ను అభివృద్ధి చేస్తోంది. అయితే మొదటి, రెండో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ ద్వారా ఉత్తమ ఫలితాలు రావడంతో.. డ్రగ్ కంట్రోల్‌ జనరల్ ఆఫ్‌ ఇండియా (DGCI) అనుమతితో ఈ నెల 16 నుంచి కోవ్యాక్సిన్ మూడోదశ ప్రయోగాలు దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ కోవాక్సిన్ ట్రయల్స్‌ను దేశవ్యాప్తంగా 25 కేంద్రాల్లో.. 26వేల మంది వాలంటీర్లపై నిర్వహించనున్నారు. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడం ఇదే మొదటిసారి. అయితే ఈ కోవ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రారంభం నాటికి అందుబాటులోకి రానుంది. Also read: Good News: ఫిబ్రవరి నాటికి కరోనా వ్యాక్సిన్: సీరం సీఈవో పూనావాలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.

మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి

 

Read More