Home> జాతీయం
Advertisement

Haryana govt: గాంధీ- నెహ్రూ ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశం

కాంగ్రెస్ ( Congress ) పార్టికీ బీజేపీ (BJP) నుంచి మరోసారి షాక్ తగిలింది. ఈ మేరకు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ, నెహ్రూ ( Gandhi-Nehru family ) కుటుంబానికి హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆస్తులపై మనోహర్ లాల్ ఖట్టర్ ( Manohar Lal Khattar ) ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

 Haryana govt: గాంధీ- నెహ్రూ ఆస్తులపై దర్యాప్తునకు ఆదేశం

Gandhi-Nehru family Assets: ఢిల్లీ: కాంగ్రెస్ ( Congress ) పార్టికీ బీజేపీ (BJP) నుంచి మరోసారి షాక్ తగిలింది. ఈ మేరకు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. గాంధీ, నెహ్రూ ( Gandhi-Nehru family ) కుటుంబానికి హర్యానా రాష్ట్రంలో ఉన్న ఆస్తులపై మనోహర్ లాల్ ఖట్టర్ ( Manohar Lal Khattar ) ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. గాంధీ కుటుంబానికి చెందిన ఆస్తులపై దర్యాప్తు చేయాలంటూ హర్యానా పట్టణాభివృద్ధి శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆనంద్ అరోరా ఆదేశించారు. వెంటనే ఈ కుటుంబానికి చెందిన ఆస్తుల వివరాల జాబితాను సిద్ధం చేయాలని సీఎస్ ఆదేశించారు. Also read: RGF: గాంధీ కుటుంబానికి షాక్

అంతేకాకుండా ఈ సమాచారం అదనపు ప్రధాన కార్యదర్శులకు కూడా పంపాలని ఉన్నతాధికారులకు సూచించారు.  భూపేంద్ర సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గాంధీ కుటుంబం సంపాదించిన ఆస్తులపై కూడా విచారణ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. Also read: SBI Jobs: డిగ్రీ అర్హతతో 3,850 బ్యాంకింగ్ ఉద్యోగాలు

ఇదిలాఉంటే గత నెలలో కేంద్ర హోంశాఖ (Home Ministry) కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్, రాజీవ్‌గాంధీ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మొమోరియల్ ట్రస్టులపై విచారణకు ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED)నాయకత్వం వహిస్తుందని ఆదేశాలు సైతం జారీ చేసింది. అయితే ఇప్పుడు ఇదే పనిని హర్యానా ప్రభుత్వం ( Haryana govt ) కూడా చేపట్టింది. Also read: Priyanka Gandhi: టీ తాగడానికి రావాలంటూ బీజేపీ నేతకు ఆహ్వానం

Read More