Home> జాతీయం
Advertisement

ఉద్యోగాలు లేని వారే అత్యాచారాలు చేస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ఉద్యోగాలు లేని వారే అత్యాచారాలు చేస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ఉద్యోగాలు లేని వారే అత్యాచారాలు చేస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

యువతలో నిరుద్యోగం వల్ల అసహనం పెరిగి అత్యాచారాలకు పాల్పడుతున్నారని హర్యానాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రేమలత సింగ్ శనివారం ఆరోపించారు. ఉద్యోగాలు లేని యువత మహిళలపై లైంగిక వాంఛ పెంచుకుంటున్నారని, దీనివల్లే దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆమె వ్యాఖానించారు."సమాజంలో ఒక తప్పుడు సాంప్రదాయం మొదలైంది. ఓ పురుషుడు.. ఓ మహిళను ఎక్కడైనా చూసినప్పుడు చెడు ఆలోచనలు చేస్తున్నాడు' అని అన్నారు.

హర్యానాలోని రేవారీ పట్టణంలోని 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై చర్చ సందర్భంగా.. కేంద్ర మంత్రి బీరెందర్ సింగ్ సతీమణి  ప్రేమలత సింగ్ పైవిధంగా వ్యాఖ్యానించారు. కాగా ఎమ్మెల్యే  ప్రేమలత సింగ్ వ్యాఖ్యలపై యువత నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలను సోషల్ మీడియాలో చాలామంది నెటిజన్లు విమర్శించారు.

హర్యానాలో సీబీఎస్‌ టాపర్‌పై సామూహిక అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. వివరాల ప్రకారం.. బాధితురాలు బుధవారం కోచింగ్‌ సెంటర్‌ నుంచి ఇంటికి తిరిగివచ్చేటప్పుడు కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అత్యాచార ఘటన నిందితుల్లో ఒకరు ఆర్మీ జవానుగా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌లో విధులు నిర్వహించే సదరు జవాను, మిగితా ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉండగా.. వారికోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి సాయం చేసినవారికి లక్ష రూపాయల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు.

 

Read More