Home> జాతీయం
Advertisement

హనీమూన్ నుంచి కరోనాతో వచ్చిన గూగుల్ టెకీ

దేశంలో కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటివరకూ దాదాపు 80 మందికి కోవిడ్ పాజిటీవ్ కేసులు వెలుగుచూశాయి.

హనీమూన్ నుంచి కరోనాతో వచ్చిన గూగుల్ టెకీ

బెంగళూరు: కర్ణాటకకు చెందిన 76ఏళ్ల మహమ్మద్ హుస్సేన్‌ది భారత్‌లో ప్రాణాంతక కరోనా వైరస్ తొలి మరణం.. కాగా ఆ రాష్ట్రంలో మరో కోవిడ్19 పాజిటీవ్ కేసు తేలింది. దీంతో కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటీవ్ కేసుల సంఖ్య 5కు చేరుకుంది. హనీమూన్‌కు వెళ్లివచ్చిన గూగుల్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు టెస్టులు నిర్వహించగా పాజిటీవ్‌గా తేలినట్లు సమాచారం. 

ఆ తప్పిదంతోనే భారత్‌లో తొలి కరోనా మరణం!

ముంబైకి చెందిన 26ఏళ్ల యువకుడు బెంగళూరులోని గూగుల్ ఆఫీసులో జాబ్ చేస్తున్నాడు. గత ఫిబ్రవరి 23న తన భార్యతో కలిసి గ్రీస్ దేశానికి హనీమూన్‌కు వెళ్లాడు టెకీ. హనీమూన్ నుంచి మార్చి 6న  ముంబైకి తిరిగొచ్చారు. మార్చి 8న ముంబై నుంచి బెంగళూరు చేరుకున్నారు. ఈ క్రమంలో అతడికి టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటీవ్‌గా తేలినట్లు గూగుల్ ఇండియా ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

రూ.299తో కరోనా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలేంటో తెలుసా?

హనీమూన్ నుంచి తిరిగొచ్చిన ఆ టెకీ మార్చి 9న తిరిగి బెంగళూరు ఆఫీసుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ టెకీకి కరోనా వైరస్ లక్షాలున్నట్లు గుర్తించామని, దీంతో ఇతర ఉద్యోగులపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు అందర్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారు.  ఉద్యోగుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని తెలిపారు. బుధవారం తొలిసారి పరీక్షలో పాజిటీవ్ రాగా, గురువారం మరోసారి టెస్టులు చేయగా అదే ఫలితం వచ్చింది. దీంతో ఆయనను జయనగర్ జనరల్ హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.

కరోనా వైరస్ పోయినా శానిటైజర్స్ వాడాల్సిందే.. ఎందుకో తెలుసా?

ముంబై నుంచి బెంగళురుకు ఆయనతో పాటు ప్రయాణించిన 18 మంది ప్రయాణికులను, టెకీ కుటుంబసభ్యులు 18 మంది, సహోద్యోలు ఇలా మొత్తంగా 50 మందికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆ టెకీ బెంగళూరులోని హెచ్‌ఏఎల్ ఎయిర్ పోర్ట్ ఏరియాలో నివాసం ఉంటున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 4500 మంది ప్రాణాంతక వైరస్ సోకి చనిపోయారు.

 

కరోనా వైరస్ మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Read More