Home> జాతీయం
Advertisement

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. గడువు పెంచుతూ EPFO కీలక నిర్ణయం..!

EPFO Higher Pension: పీఎఫ్‌ ఖాతారులకు ఊరట కలిగించేలా ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హయ్యర్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సమర్పించేందుకు యజమాన్యాలకు మరో ఐదు నెలల గడువు పెంచుతున్నట్లు ప్రకటించింది.
 

EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. గడువు పెంచుతూ EPFO కీలక నిర్ణయం..!

EPFO Higher Pension: వేతన వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడానికి యజమానులకు మరోసారి గడువు పొడిగింపు ప్రతిపాదనకు ఈపీఎఫ్‌ఓ అంగీకారం తెలిపింది. అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వేతన వివరాలను అప్‌లోడ్ చేసేందుకు యజమానులకు ​​సమయాన్ని మరో ఐదు నెలల పాటు అంటే మే 31, 2024 వరకు పొడిగించినట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్ లేదా జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం దరఖాస్తులను సమర్పించడానికి ఈపీఎఫ్‌ఓ ​​ద్వారా ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛన్‌కు ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్‌ఓ సంస్థ దరఖాస్తులు స్వీకరిస్తోంది.

మొదటగా గతేడాది జులై 11వ తేదీ వరకు తుది గడువు ఇవ్వగా.. మొత్తం 17.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సభ్యులు, పెన్షన్‌దారుల వేతన వివరాలు సమర్పించేందుకు యాజమాన్యాలు అదనపు గడువు ఇవ్వాలని ఈపీఎఫ్‌ఓను కోరాయి. మొదట సెప్టెంబర్ 30న వరకు గడువు పెంచింది. ఆ తరువాత మరోసిరా డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. తాజాగా మరోసారి గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మే 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. 

ఆప్షన్/జాయింట్ ఆప్షన్‌ల ధ్రువీకరణ కోసం 3.6 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు ఇంకా ప్రాసెసింగ్ కోసం యజమానుల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి గడువు పొడగించినట్లు ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. దీంతో 3.6 లక్షల మంది అధిక పెన్షన్ ఆశావాహులకు ఊరట లభించించింది. ఈ ఐదు నెలలోపు ప్రక్రియను పూర్తి చేయాలని యాజమాన్యాలను అధిక పెన్షన్ ఆశావాహులు కోరుకుంటున్నారు.

Also Read: Oppo Reno 11 Series: శక్తివంతమైన 50MP కెమెరాతో మార్కెట్‌లోకి Oppo Reno 11, Reno 11 Pro మొబైల్స్‌..విడుదల తేది అప్పుడే..

Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Read More