Home> జాతీయం
Advertisement

Gold Smuggling: భారీగా బంగారం అక్రమ రవాణా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 8 కిలోలు పట్టివేత

Gold Smuggling: అక్రమ బంగారం సరఫరాకు విమానాశ్రయాలు అడ్డాగా మారుతున్నాయి. ఎన్ని చర్యలు చేపట్టినా బంగారం స్మగ్లింగ్ ఘటనలు చేటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా 8 కిలోల బంగారం పట్టుబడింది. పూర్తి వివరాలు మీ కోసం..

Gold Smuggling: భారీగా బంగారం అక్రమ రవాణా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 8 కిలోలు పట్టివేత

Gold Smuggling: మొన్న తిరువనంతపురం, నిన్న చెన్నై..ఇవాళ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్. ఇలా విమానాశ్రయాలను మార్చుతూ అక్రమ బంగారం యఛేచ్ఛగా తరలిపోతోంది. కొన్ని పట్టుబడుతుంటే చాలావరకూ రవాణా అయిపోతున్నాయి. విదేశాల్నించి స్వదేశానికి అక్రమంగా బంగారం తరలిస్తున్న వ్యక్తుల్ని పట్టుకున్నారు. 

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. బ్యాంకాక్, షార్జా, దుబాయ్ నుంచి నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కొందరు ప్రయాణీకుల్నించి ఒకేరోజు పెద్దమొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ వ్యక్తి నుంచి 2 కిలోల బంగారం, మరో ప్రయాణీకుడి నుంచి 1.78 కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే రోజు షార్జా నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్న మరో ప్రయాణీకుడి నుంచి 2.17 కిలోల బంగారం, దుబాయ్ నుంచి శంషాబాద్ చేరుకున్న ప్రయాణికుడి నుంచి 2.05 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ముగ్గురు ప్రయాణీకుల్నించి 2.29 కోట్ల విలువైన 3,743 గ్రాముల బంగారం స్వాధీనమైంది. ఇక జెడ్డా నుంచి వచ్చిన ప్యయాణీకుడి నుంచి 594 గ్రాముల బంగారం లభించింది. ఇక మరో ప్రయాణీకుడి నుంచి 1225 గ్రామలు బంగారం దొరికింది. దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి లో దుస్తుల్లోంచి 1924 గ్రాముల బంగారం కొనుగోలు చేసేందుకైంది. 

Also read: Akshay kumar: ఓ మై గాడ్ 2 చుట్టూ వివాదం, అక్షయ్ కుమార్‌పై 10 లక్షల రివార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More