Home> జాతీయం
Advertisement

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ధన్‌తెరాస్, దీపావళి తర్వాత భారీగా తగ్గిన బంగారం ధరలు

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: ధన్‌తెరాస్, దీపావళి పర్వదినాన బంగారం కొనుగోలు చేయాలనే సెంటిమెంట్ నేపథ్యంలో పండగ నాటికి బంగారం ధర కొంత పెరిగినప్పటికీ.. దీపావళి తర్వాత మంగళవారం నాటికి బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.548 తగ్గి రూ.38,857కు పడిపోయింది. అంతకన్నా ముందుగా శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ. 39,405 వరకు పలికింది. గ్లోబల్ ట్రెండ్స్ కారణంగానే బంగారం ధరలు క్షీణించినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. అమెరికా-చైనా ట్రేడ్ వార్ సైతం బంగారం ధరలు పడిపోవడానికి ఓ కారణంగా మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మంగళవారం న్యూయార్క్‌లో బంగారం ధర ఔన్స్‌కు 1,493 డాలర్లుగా ఉంది. 

ఇదిలావుంటే, మరోవైపు వెండి ధర కూడా భారీగా క్షీణించింది. దేశరాజధాని ఢిల్లీలో శుక్రవారం రూ .48,280 వద్ద ముగిసిన కిలో వెండి ధర మంగళవారం కిలోకు రూ. 1,190 రూపాయలు పడిపోయి రూ. 47,090కి క్షీణించింది. పారిశ్రామికవర్గాలు, నాణేల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడమే వెండి ధరలు క్షీణించడానికి కారణమైనట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి.

Read More