Home> జాతీయం
Advertisement

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో వరుసగా నాలుగోరోజు బంగారం ధరలు (Gold Price In Hyderabad) పెరిగాయి. తాజాగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. నేడు వెండి ధర భారీగా పుంజుకుంది. రూ.70వేలకు చేరువ కావడానికి వెండికి ఛాన్స్ ఉంది.

Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. డిమాండ్ లేకపోవడంతో తగ్గుతున్న వెండి ధర నేడు ఓ మోస్తరుగా పెరిగింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.170 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,720 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,250కి చేరింది. Vadivel Balaji Dies: కమెడియన్ వడివేల్ బాలాజీ మృతి

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) స్వల్పంగా పెరిగాయి. తాజా రూ.220 మేర బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,820కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.200 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.50,250 వద్ద ట్రేడ్ అవుతోంది. Rishabh Pant: ధోనీని ఫాలో కావొద్దు.. రిషభ్ పంత్‌కు ఎమ్మెస్కే ప్రసాద్ వార్నింగ్

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) నేడు భారీగా పెరిగింది. తాజాగా రూ.660 మేర ధర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.68,560కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఈ ధర వద్ద మార్కెట్ అవుతుంది. Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYeR

Read More