Home> జాతీయం
Advertisement

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

గత రెండు రోజులుగా బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు (Gold Price Today In Hyderabad), వెండి ధరలు తాజాగా దిగొచ్చాయి. పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు బులియన్ మార్కెట్ ధరలపై ప్రభావం చూపుతాయి.

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్‌లో గత రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు (Gold Rate Today) తాజాగా తగ్గాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.90 మేర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,640 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,250కి క్షీణించింది.

ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) స్వల్పంగా దిగొచ్చాయి. తాజాగా రూ.250 మేర పసిడి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,420 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,250 కి పతనమైంది.

బులియన్ మార్కెట్‌లో గత రెండు రోజులుగా పెరిగిన వెండి ధర (Silver Rate in India) స్వల్పంగా తగ్గింది. తాజా వెండి ధర రూ.300 చొప్పున తగ్గింది. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.60,700కి దిగొచ్చింది. దేశ వ్యాప్తంగా ఇదే ధర వద్ద వెండి ట్రేడ్ అవుతుంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Read More