Home> జాతీయం
Advertisement

Job vacancies: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీగా ఉద్యోగాలు- పూర్తి వివరాలు ఇవే..

Job vacancies: ఉద్యోగం కోసం వెతుకున్నారా? అయితే మీకో శుభవార్త. ఈ వారం నుంచి పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

Job vacancies: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీగా ఉద్యోగాలు- పూర్తి వివరాలు ఇవే..

Job vacancies: నిరుద్యోగులకు గుడ్​ న్యూస్. పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ ఖాలీలకు సంబంధించి ఈ వారం నుంచి నియామకాల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏ రంగంలో ఉద్యోగ అవకాశాలు (Jobs News) ఉన్నాయి? దరఖాస్తులు చేసుకునేందుకు చివరి తేదీ ఎప్పుడు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇండియన్​ ఆర్మీ..

ఆర్మీలో వివిధ విభాగాలకు సంబంధించి రిక్రూట్​మెంట్ ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపింది ఇండియన్​ ఆర్మీ(Jobs in Indian Army). జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ కాంట్‌లోని సిక్కు రెజిమెంటల్ సెంటర్‌కు సంబంధించి పలు పోస్టు్లకోసం ఈ ప్రక్రియ జరగనుంది. ఇందులో ఓబీసీలకు రిజర్వ్​ చేసిన లోవర్​ డివిజన్ క్లర్క్​ పోస్ట్​లు సహా.. నాలుగు కుక్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు (Indina Army Jobs news) చివరి తేదీ జనవరి 8.

టెర డేటా సాఫ్ట్​వేర్​..

అమెరికాకు చెందిన సాఫ్ట్​వేర్ కంపెనీ టేరా డేటా సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ల (Jobs in Tera Data) ఉద్యోగ నియామకాలు చేపట్టింది. హైదరాబాద్​ క్యాపంస్​ కోసం ఈ నియామకాలు (Jobs in Hyderabad) జరుగుతున్నాయి. ఇదే రంగంలో మూడు సంవత్సరాల ఎక్స్​పీరియన్స్ ఉన్న వారితో పాటు.. ఫ్రెషర్స్​కు కూడా అవకాశాలిస్తుస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి బీఈ, బీటెక్​ విద్యార్హతలుగా నిర్ణయించింది.

ఎస్​ఎస్​సీ సీజీఎల్​ రిక్రూట్​మెంట్​ 2021

స్టాఫ్​ సెలక్షన్​ కమిషన్​ (ఎస్​ఎస్​సీ).. కంబైన్డ్​ గ్రాడ్యుయేట్​ లెవెల్​ (సీజీఎల్​) టైర్ 1 ఎక్జామినేషన్​ 2021 కోసం దరఖాస్తులు (SSC Jobs) స్వీకరిస్తోంది. వివిధ మంత్రిత్వ శాఖల్లో గ్రూప్​ బీ, సీ విభాగాల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుక 2022 జనవరి 23 చివరి తేదీ.

టీసీఎస్​లో ఫ్రెషర్స్​కు ఉద్యోగాలు..

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్​​ ఫ్రెషర్స్​కు భారీగా ఉద్యోగ అవకాశాలు (TCS Job opportunities for freshers) ప్రకటించింది. బిజినెస్​ ప్రాసెస్​ సర్వీసెస్​ (బీపీఎస్​) పోస్టులకు నియామకాలు చేపట్టనుంది. ఆర్ట్స్​, సైన్స్​, కామర్స్​లో డిగ్రీ ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. జనవరి 7 నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చు. జనవరి 26 నుంచి రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలు (IT Job vacancies) ఉంటాయి.

ఇండియన్​ కోస్ట్​ గార్డ్​..

నావిక్​, యాత్రిక్​ పోస్ట్​లలో 322 ఖాళీలకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది ఇండియన్ కోస్ట్​ గార్డ్​.ఈ పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ జనవరి 4న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జనవరి 14. పురుషుల విభాగంలో మాత్రమే ఈ ఖాళీలు ఉన్నాయని ఇండియన్​ కోస్ట్ గార్డ్ వెల్లడించింది.

Also read: Leopard Attack Pet Dog:గేటు దూకి పెంపుడు కుక్కపై దాడి చేసిన చిరుతపులి.. చివరికి ఏమైందంటే? వీడియో చూస్తే షాకే!!

Also read: Corona cases in India: దేశంలో కొత్తగా 6,987 కరోనా కేసులు, 162 మరణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Read More