Home> జాతీయం
Advertisement

Petrol Price Today: భారత్‌లో తొలిసారి.. పెట్రోల్‌ను దాటేసిన డీజిల్ ధర

Diesel Costlier Than Petrol Price | ధర ఎప్పుడూ పెట్రోల్ ధర కంటే తక్కువగా ఉంటుందని మనందరికీ ఒక అంచనా ఉండేది. కానీ ఆ అంచనానే ఇప్పుడు తలకిందులైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో డీజిల్ ధర పెట్రోల్ ధరను అధిగమించడం భారత మార్కెట్లో ఇదే మొదటిసారి.

Petrol Price Today: భారత్‌లో తొలిసారి.. పెట్రోల్‌ను దాటేసిన డీజిల్ ధర

Diesel Costlier Than Petrol | ఇలా జరుగుతుందని సాధారణంగా మీరెప్పుడూ ఊహించి ఉండరు. డీజిల్ ధర ఎప్పుడూ పెట్రోల్ ధర కంటే తక్కువగా ఉంటుందని మనందరికీ ఒక అంచనా ఉండేది. కానీ ఆ అంచనానే ఇప్పుడు తలకిందులైంది. ఎవ్వరూ ఊహించని రీతిలో డీజిల్ ధర పెట్రోల్ ధరను అధిగమించడం భారత మార్కెట్లో ఇదే మొదటిసారి. గత 18రోజుల నుంచి దేశంలో ప్రతీరోజు పెట్రోల్, డీజీల్ ధరలు (petrol & diesel prices in India) పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (HPCL, BPCL, IOC) మరోసారి ధరలను పెంచాయి. 

ఈ సారి పెట్రోల్ ధరలో ఎలాంటి మార్పు చేయలేదు కానీ.. డీజిల్ ధరను మాత్రం లీటరుకు 48పైసలను పెంచాయి. దీంతో బుధవారం ధరలు పెరిగిన తరువాత ఢిల్లీ (Delhi)లో లీటర్ డీజిల్ ధర రూ.79.88 కాగా, పెట్రోల్ ధర(Petrol Price today) రూ.79.76గా ఉంది. ఒకవైపు గత 15 రోజులుగా ముడి చమురు ధర బ్యారెల్కు 35-40 డాలర్ల మధ్య ఉన్నా.. మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా  పెరగుతుండటం గమనార్హం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు గత 18 రోజుల్లో పెట్రోల్ ధరను సుమారు రూ.8.50 పెంచగా, డీజిల్ ధరను రూ .10.25 పెంచింది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ
 

Read More