Home> జాతీయం
Advertisement

Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్

Five states Assembly Elections Schedule: కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది.

 Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల కమిషన్

Five states Assembly Elections Schedule: కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. మొత్తం ఏఢు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 10న మొదటి విడత పోలింగ్ జరగనుండగా మార్చి 7న చివరి విడత పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ :

యూపీలో మొత్తం 7 విడతల్లో ఎన్నికల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 10న మొదటి విడత, ఫిబ్రవరి 14న రెండో విడత, ఫిబ్రవరి 20న మూడో విడత, ఫిబ్రవరి 23న నాలుగో విడత, ఫిబ్రవరి 27న ఐదో విడత, మార్చి 3న ఆరో విడత, మార్చి 7న ఏడో విడత పోలింగ్ జరగనుంది.

 

ఆ మూడు రాష్ట్రాలకు ఒకే విడతలో ఎన్నికలు :

పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. 

మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు :

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

fallbacks

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్లు, ఏర్పాట్ల వివరాలు :

  • ఎన్నికలు జరగబోయే ఐదు రాష్ట్రాల్లో ఈసారి 24.9 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
  • ఐదు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 18.34 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 8.55 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
  • ఎన్నికలు జరిగే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక పోలింగ్ కేంద్రం పూర్తిగా మహిళల నిర్వహణలో ఉంటుంది.
     
  • 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజెన్లు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం.
  • ఐదు రాష్ట్రాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించేందుకు సరిపడా ఈవీఎం,వీవీపాట్‌లను ఇప్పటికే  సిద్ధం.
  • ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారాన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. క్రిమినల్ కేసులతో సహా అన్ని వివరాలు అందులో పొందుపరచాలి.
  • ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మరుక్షణమే అమలులోకి రానున్న ఎన్నికల కోడ్.

Also Read: గతంలో కరోనా నుంచి కోలుకున్నవారికి ఒమిక్రాన్ సోకుతుందా..? పరిశోధనలు ఏం చెప్తున్నాయి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Read More